Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భద్రాచలం
భద్రాచలం ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు తాళ్లూరి భారతీదేవి జ్ఞాపకార్థం తాళ్లూరి పంచాక్షరయ్య, తాళ్లూరి జయ శేఖర్ (మాజీ తానా అధ్యక్షులు) 50 సిమెంట్ బెంచీలను బహూకరించారు. ఈ సందర్భంగా తాళ్లూరి పంచాక్షరయ్య, రిటైర్డ్ ప్రిన్సిపాల్ తిప్పని సిద్ధులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డి.భద్రయ్య, వైస్ ప్రిన్సిపాల్ నరేందర్ రెడ్డి, అకడమిక్ కోఆర్డినేటర్ వేముల కామేశ్వరరావు, ప్రముఖులు అడుసుమిల్లి జగదీష్, చిగురుమల శ్రీనివాస్, చావ లక్ష్మీనారాయణ, పల్లంటి దేశప్ప, కళాశాల అధ్యాపకులు శ్యాంప్రసాద్ రెడ్డి, వీరన్న, జాయి కిరణ్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.