Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మణుగూరు
లంక మల్లారం పంచాయతీలో మంచినీటి సమస్యను పరిష్కరించాలని సీపీఐ(ఎం) మండల కమిటీ కార్యదర్శి కొడిశాల రాములు డిమాండ్ చేశారు. గురువారం బ్రహ్మంగారి గుట్ట (లంక మల్లారం) గ్రామంలో మంచినీటి సమస్యపై ఇంటింటా సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో గత ఆరు రోజులుగా మంచినీరు రాక ప్రజలు అవస్థ పడుతున్నారన్నారు. బోరు బావులు తదితర మంచినీటి సౌకర్యాలు లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నరన్నారు. మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో మంచి నీటిసమస్య లేదని సభ్యులు తెలిపారని, కానీ దానికి విరుద్ధంగా గ్రామాలలో తీవ్ర మంచినీటి సమస్య ఉన్నదన్నారు. మండలంలో 14 గ్రామపంచాయతీలో మంచినీటి సమస్య ఉన్నదని అధికారులు స్పందించి వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి సభ్యులు టీవీ ప్రసాద్, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.