Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు
నవతెలంగాణ-తిరుమలాయపాలెం
5న ఢిల్లీలో జరిగే మహా ధర్నాను జయప్రదం చేయాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. గురువారం మండల కేంద్రంలో కామ్రేడ్ గజ్జల వెంకటయ్య భవన్లో నెరుసుల వెంకటేష్ అధ్యక్షతన జరిగిన మండల రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, సిఐటియు మండల జనరల్ బాడీ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఢిల్లీలో కార్మిక కర్షక రైతుల మహా ధర్నా 10 లక్షల మందితో జరుగుతుందని, ఈ ధర్నాకు పెద్ద ఎత్తున కార్మికులు, కర్షకులు, రైతులు పెద్దఎత్తున కదలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. పంటకు గిట్టుబాటు ధర కావాలని, స్వామినాథన్ కమిషన్ సిఫారసులను అమలు చేయాలని, కనీస వేతన చట్టం అమలు చేయాలని, ఉపాధి హామీ పథకానికి నిధులు భారీగా కేటాయించాలని, రైతాంగ సమస్యల పరిష్కారం కోసం ఢిల్లీలో మహాధర్నా జరుగుతుందని, ఈ యొక్క ధర్నాకు తరలిరావాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు, వ్యకాస జిల్లా నాయకులు యర్ర శ్రీనివాసరావు, సిపిఎం మండల కార్యదర్శి కొమ్ము శ్రీను, రైతు సంఘం మండల అధ్యక్ష కార్యదర్శులు తుళ్లూరీ నాగేశ్వరరావు, బింగి రమేష్, వ్యవసాయ కార్మిక సంఘం మండల అధ్యక్షుడు వెంకటేష్, సిఐటియు మండల కార్యదర్శి వశపొంగు వీరన్న, షేక్ పాషా, ధర్మాచారి, కొమ్ము వెంకన్న, కోట ఉపేందర్ రెడ్డి, సిద్దుల వెంకన్న, యశోద, రావుల వెంకట్రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.