Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా కలెక్టర్ విపి.గౌతమ్
నవతెలంగాణ - ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
హరితహారం మొక్కలు నాటుటకు పకడ్బందీ కార్యాచరణ చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ అన్నారు. ఐడిఓసీలోని కాన్ఫరెన్స్ హాల్లో అధికారులతో తెలంగాణకు హరితహారం అమలుపై కలెక్టర్ గురువారం సమీక్ష నిర్వహించారు. 2023లో 32.477 లక్షల మొక్కలు నాటుటకు లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. లక్ష్య సాధనకు శాఖల వారీగా లక్ష్యం ఇచ్చి పూర్తికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అటవీశాఖ ద్వారా 7.6 లక్షలు, పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి ద్వారా 10 లక్షలు, నీటిపారుదల శాఖచే 2.477 లక్షలు, వ్యవసాయం, సహకార శాఖల ద్వారా 4.5 లక్షలు, రెవిన్యూ శాఖకు 60 వేలు, పురపాలన, పట్టణా భివృద్ధి శాఖకు 4.780 లక్షలు, విద్యా శాఖకు 30 వేలు, పరిశ్రమల శాఖకు 30 వేలు, గనుల శాఖకు 60 వేలు, విద్యుత్ శాఖచే 1.320 లక్షల మొక్కల నాటడం లక్ష్యంగా చర్యలు చేపడుతున్నట్లు అన్నారు. నర్సరీల్లో సీడ్ డిబ్లింగ్, జెర్మేషన్ ప్రక్రియ మార్చిలోగా పూర్తిచేయాలన్నారు. ప్రైమరీ బెడ్లను బలోపేతం చేయాలన్నారు. రైతుల జాబితా, ఎంత మేర మొక్కల నాటడం చేస్తున్నది కార్యాచరణ చేయాలన్నారు. లే అవుట్ గ్రీన్ స్పెస్, గోళ్లపాడు ఛానల్ పట్టణ ప్రకృతి వనాలు, ఎన్ఎస్పీ కాల్వ వెంబడి మొక్కలు నాటుటకు కార్యాచరణ చేయాలన్నారు. ప్లాంటేషన్‌కు బ్లాకులను గుర్తించి, ఏ సర్వే నెంబర్ లో, ఏయే ప్రదేశాల్లో ఎంత మేర మొక్కల నాటడం చేసునున్నది పటిష్ట కార్యాచరణతో వచ్చే సమావేశానికి హాజరవ్వాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ స్నేహలత మొగిలి, ఖమ్మం మునిసిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, జిల్లా అటవీ అధికారి సిద్దార్థ్ విక్రమ్ సింగ్, జెడ్పి సిఇఓ అప్పారావు, డిఆర్డీఓ విద్యాచందన, జిల్లా వ్యవసాయ అధికారిణి విజయ నిర్మల, జిల్లా ఉద్యానవన అధికారిణి అనసూయ, జిల్లా నీటిపారుదల శాఖ అధికారి వెంకట్రాం, ఎఫ్డివో ప్రకాశరావు, మునిసిపల్ కమిషనర్లు రమాదేవి, సుజాత, సునీత, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
లక్ష్యానుగుణంగా 'కంటివెలుగు'
నిర్దేశిత లక్ష్యాలకనుగుణంగా పూర్తి స్థాయిలో పరీక్షలు నిర్వహించి అవసరమైన వారందరికీ కళ్ళజోళ్లు పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయ సమావేశ మందిరంలో వైద్యాధికారులతో కంటి వెలుగు పురోగతి, సాధారణ ప్రసవాలు, క్షయవ్యాధి బాధితుల గుర్తింపుపై కలెక్టర్ గురువారం సమీక్షించారు. రెండో విడత కంటి వెలుగులో సాధించిన పురోగతి, ప్రిస్కిప్షన్ కళ్లజోళ్ల పంపిణీ వివరాలను అడిగి తెలుసుకున్నారు. నిర్దేశిత సమయంకంటే ముందుగానే పూర్తి స్థాయిలో పరీక్షలు నిర్వహించి కళ్ళజోళ్లు పంపిణీ చేయాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాలపై గర్భీణులకి, కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించి సాధారణ ప్రసవాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. జిల్లాలో 171 హెల్త్, వెల్ నెస్ కేంద్రాలు గుర్తించినట్లు, ఇందులో 164 ప్రభుత్వ, 7 అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఇందులో కొత్తగా మంజూరైన 53 కేంద్రాలు మినహా మిగిలిన చోట్ల పెయింటింగ్ పనులు చేపట్టి, పూర్తి చేయాలని, లోగో, ఇతర సూచనలు సమాచారం ఇస్తామని తెలిపారు. ఈ సమీక్షలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డా.బి.మాలతీ, ఉప వైద్య, ఆరోగ్యాధికారి డా.రాంబాబు, డా.సైదులు, డా.సుబ్బారావు, ప్రోగ్రాం అధికారులు, వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు.