Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఖమ్మం డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ బి.రవికుమార్
నవతెలంగాణ-కొత్తగూడెం
పోస్టల్ శాఖ ద్వారా 21214 పోస్టల్ ఎకౌంట్స్ ఓపెన్ చేయడం ద్వారా తెలంగాణ సర్కిల్లో ప్రథమ స్థానం, దేశంలో ఐదవ స్థానంను ఉమ్మడి ఖమ్మం జిల్లా పోస్టల్ శాఖ సాధించిందని ఖమ్మం డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ బి. రవికుమార్ శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత తపాలా శాఖ దేశవ్యాప్తంగా పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ బ్యాంకు మహామేళను ఈ ఏడాది ఫిబ్రవరి 20వ తేదీ నుంచి 28వ తేదీ వరకు మహామేళను నిర్వహించిందన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా పోస్టల్ శాఖ 823 పోస్ట్ ఆఫీస్‌ల ద్వారా 21214 పోస్టల్ అకౌంట్స్‌ను ఓపెన్ చేసి ఉమ్మడి ఖమ్మం జిల్లా పోస్టల్ శాఖ తెలంగాణ సర్కిల్లో ప్రథమ స్థానం, భారత దేశంలో ఐదవ స్థానం సాధించిందన్నారు. అదేవిధంగా ఖమ్మం డివిజన్ పరిధిలోని 10 సబ్ డివిజన్లో ఖమ్మం నార్త్ సబ్ డివిజన్ 3429 ఎకౌంట్స్‌ను ఓపెన్ చేసి ప్రథమ స్థానంలో నిలవగా, మధిర సబ్ డివిజన్లో 3123 పోస్టల్ అకౌంట్స్, ఖమ్మం ఈస్ట్ సబ్ డివిజన్ 2687 పోస్టల్ ఎకౌంట్స్‌ని ఓపెన్ చేసి ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయని తెలిపారు. హైదరాబాద్ పోస్టల్ రీజియన్ పరిధిలో 1,14,061 అకౌంట్స్ ఓపెన్ చేసి దేశంలో నాలుగో స్థానంలో (మొత్తం 47 రీజియన్లు) నిలిచిందన్నారు. తెలంగాణ సర్కిల్ పరిధిలో 1,52,833 పోస్టల్ అకౌంట్స్ తెరిచి దేశంలో 5వ స్థానంలో (24 సర్కిల్లో) నిలిచిందన్నారు. పోస్టల్ ఖాతాల మహామేళను విజయవంతం చేయడంలో భాగస్వామ్యం అయిన ప్రజలకు, అధికారులకు సిబ్బందికి అందరికి ఆయన ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ప్రతి ఒక్కరు పోస్టల్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.