Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడెం
కొత్తగూడెం ఏరియా స్టోర్కు సంబంధించిన ఎక్స్ ప్లోజివ్ మ్యాగ్జిన్లో అగ్ని ప్రమాదం సంబంధించిందని సింగరేణి కాలర్స్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంద నరసింహారావు పేర్కొన్నారు. గురువారం రాత్రి 8 గంటలకు 5 ఇంక్లైన్ పరిధిలో మ్యాగ్జిన్లో చుట్టుపక్కల ఉన్న చెత్తాచెదారం అంటుకోవడంతో ఆ ప్రాంతం మొత్తం కాలి బూడిద అయిందని, యాజమాన్యం నిర్లక్ష్యం వైఖరి వల్లనే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపించారు. ఎక్స్ ఫ్లోజీవ్ నిల్వ ఉంచుతున్న ప్రదేశంలో చుట్టూ పక్కల 100 మీటర్ల వరకు ఎలాంటి చెత్తాచెదారం లేకుండా యాజమాన్యం తగిన జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం ఉందని కానీ, యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా మెయింటెనెన్స్ చేయించలేకపోవడం వల్ల తృటిలో భారీ ప్రాణ నష్టము తప్పిందన్నారు.
ఈ మ్యాగ్జిన్ నుండి ఎక్స్ ప్లోజివ్స్ కొత్తగూడెం పరిధిలోని సంబంధించిన జీకేఓసి, పీవీకే ఫైవ్ సత్తుపల్లి, ఇల్లందు కోయగూడెం మణుగూరు ప్రాంతాలకు ఇక్కడి నుండే ఎక్స్ ప్లోజివ్స్ సప్లై అవుతాయని తెలిపారు. రెస్క్యూ సిబ్బందికి సమాచారం అందడంతో సమాయాని వచ్చి మంటలను ఆర్పి అదుపులోకి తీసుకు వచ్చారన్నారు. లేని పక్షంలో చుట్టూ ప్రక్కల గ్రామాలు, మాయా బజార్, రుద్రంపూర్, పి.వికే-5 ఇంక్లైన్ భారీ పేలుళ్లతో ప్రాణనష్టం జరిగేదన్నారు. యాజమాన్యం ఎక్స్ ప్లోజివ్స్ నిలువ వుంచిన ప్రదేశంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవడం లేదని తెలిపారు.