Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడెం
నిషేధిత సీపీఐ మావోయిస్టు పార్టీకి చెందిన ఇద్దరు పామేడు దళం సభ్యులను, ఒక సానుభూతి పరుడిని అరెస్టు చేసినట్లు ఎస్పీ వినీత్.జి శుక్రవారం తెలిపారు. తెలంగాణ, చత్తీస్ఘడ్ రాష్ట్ర సరిహద్దు గ్రామాలైన పైడిగూడెం అటవీ ప్రాంతంలో దుమ్ముగూడెం పోలీసులు, సిఆర్పిఎఫ్ 212, సిఆర్పిఎఫ్ 141 బెటాలియన్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన కూబింగ్ ఆపరేషన్లో నిషేధిత సీపీఐ మావోయిస్టు పార్టీకి చెందిన ఇద్దరు పామేడు దళ సభ్యులను, ఒక మావోయిస్టు సానుభూతిపరుడిని అరెస్టు చేసినట్లు తెలిపారు. అరెస్ట్ అయిన వారు చత్తీస్ఘడ్ రాష్ట్రం కొమరారం గ్రామానికి చెందిన సోడి కామే, సోడి బండుగా, సోడి చంటి ఫలచలమా గ్రామం కిష్టారం (మావోయిస్టు సానుభూతిపరుడు)కు చెందిన వారని తెలిపారు. సోడి కామే, సోడి బందు గత ఐదు సంవత్సరాల నుండి మావోయిస్టు పార్టీ కామేడు దళంలో దళ సభ్యులుగా పనిచేస్తూ తెలంగాణ చత్తీస్ఘడ్ రాష్ట్ర మావోయిస్టు పార్టీ సభ్యులతో కలిసి అనేక సంఘటనలో పాల్గొన్నట్టు ఎస్పీ తెలిపారు. వీరిపై దుమ్ముగూడెం, చర్ల చత్తీస్ఘడ్ రాష్ట్రాలలో పలు కేసులు నమోదయ్యాయని పేర్కొన్నారు.