Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భద్రాచలం
హిందూ ఉన్మాద బీజేపీ పాలనలో ఆదివాసి, దళిత మహిళలకు జరుగుతున్న అన్యాయాన్ని వ్యతిరేకిస్తూ శుక్రవారం పీఓడబ్ల్యు ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన భద్రాచలంలో నిర్వహించారు. అనంతరం ఆర్డీవోకు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా పీఓడబ్ల్యూ రాష్ట్ర కార్యదర్శి ఏ నిర్మళ మాట్లాడుతూ...5వ షెడ్యూలు ఏరియాలో నివాసం ఉంటున్న ఆదివాసీ, దళిత నిరుపేద మహిళలకు డబల్ బెడ్ రూంలు కట్టించాలని, గోదావరి ముంపుకు గురైన 28 వేల మంది ప్రజలకు సురక్షిత ప్రాంతంలో గృహాలు నిర్మిస్తామని 2022 జూలై 17న భద్రాచలంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. 230 రోజుల నుండి నిరుపేదలు ''నిరవధిక నిరసన దీక్ష'' చేస్తూ మంత్రులు, అధికారులకు వినతి పత్రాలు ఇచ్చిన పట్టించుకోవడం లేదని, నిరసన చేస్తున్న మహిళలపై ఫారెస్టు సిబ్బంది రెండుసార్లు దాడులు చేశారని ఆరోపించారు. ఇంటి స్థలాల పోరాటానికి లక్ష్మీదేవి పల్లి జడ్పీటీసీ మేరెడ్డి వసంత మద్దతు తెలుపుతూ ప్రసంగించారు. ఇండ్ల సాధన పోరాట కమిటీ నాయకురాలు సున్నం భూలక్ష్మి మాట్లాడారు. ఆర్డీఓ కార్యాలయం ముందు జరిగిన మీటింగ్కు పీఓడబ్ల్యు జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దగోని ఆదిలక్ష్మి అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షుడు బాణోత్ ఊక్లా, పీఓడబ్ల్యు జిల్లా నాయకులు జాడి మంజుల, పోరాట కమిటీ నాయకురాలు కుర్సం సుజాత, చిడెం ప్రశాంత్, గొగ్గెల ఎర్రన్న, రమణ, బండ్ల మునెమ్మ, కూంజ మణి, ఈర్ప లక్షీ, పీఓడబ్ల్యూ జిల్లా అధ్యక్షుడు ఏ సాంబ తదితరులు పాల్గొన్నారు. గోదావరి ముంపు బాధితుల, నిరుపేదల ఇండ్ల సమస్యను పరిష్కరించనట్లయితే పోరాటాన్ని ఉధృతం చేస్తామని ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షుడు బాణోత్ ఊక్లా ప్రభుత్వాన్ని హెచ్చరించారు.