Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమస్యలు పరిష్కరించాలని ఆదేశాలు
నవతెలంగాణ-ఇల్లందు
మున్సిపల్ వార్డులలో ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ హరి సింగ్ నాయక్ శుక్రవారం పర్యటించారు. ప్రజలను కలుసుకొని సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. వార్డులో కలియ తిరుగుతూ ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరించారు. ఈ సందర్భంగా 17వ వార్డులో ప్రజలు అనేక సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. సమస్యలు త్వరితగతిన పరిష్కరించాలని అక్కడే ఉన్నా కమిషనర్ అంకుష్యవలిని ఆదేశించారు. రోడ్లను డ్రైనేజీలను పరిశీలించి నూతనంగా సీసీ రోడ్లు, సైడ్ డ్రైనేజీ మంజూరు చేస్తానని అన్నారు. మంత్రి కేటీఆర్ సహకారంతో ఇల్లందు మున్సిపాలిటీ అభివృద్ధి చెందుతుందని, మరికొంత అభివృద్ధి కోసం రూ.50 కోట్ల నిధులు సిద్ధంగా ఉన్నాయని అన్నారు. పర్యటన కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ దిండిగాల రాజేందర్, మున్సిపల్ వైస్ చైర్మన్ సయ్యద్ జానీ పాషా, రైతుబంధు సమన్వయ సభ్యులు పులిగండ్ల మాధవరావు, కమిషనర్ అంకుశవాలి, మునిసిపల్ పాలకవర్గ కౌన్సిలర్స్, కొక్కు నాగేశ్వరావు, తోట లలిత శారద, రజిత, చీమల సుజాత, తార, సరిత, మాధవి తదితరులు పాల్గొన్నారు.