Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్యాలయానికి తాళం వేసిన చిట్టి బాధితులు
నవతెలంగాణ-భద్రాచలం రూరల్
భద్రాచలం పట్టణంలోని అక్షర చిట్ ఫండ్ ప్రైవేట్ ఏజెన్సీ వద్ద చిట్టి బాధితులు ఆందోళన నిర్వహించారు. చిట్టి పాడుకొని ఆరు నెలలు గడుస్తున్నా రావలసిన డబ్బులు ఇవ్వకుండా కార్యాలయం చుట్టూ తిప్పుతున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. వివరాల్లోకి కళ్తే... భద్రాచలం పట్టణానికి చెందిన బత్తుల కృష్ణ అనే వ్యాపారస్తుడు అక్షరచిట్ ఫండ్ వద్ద రూ.20 లక్షల చిట్టి వేసి ఆరు నెలల క్రితం పాడారు. అక్షర చిట్ ఫండ్ సంబంధిత నిర్వాహకులు ఇవ్వవలసిన రూ.20 లక్షల ఇవ్వకుండా తిప్పుతున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. గత సంవత్సరం కాలం నుండి అక్షర చిట్ ఫండ్స్ వద్ద చిట్టీలు పాడిన ఏ ఒక్కరికి డబ్బులు ఇవ్వడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాము రూపాయి రూపాయి పోగుచేసుకొని దాచుకున్న డబ్బులని ఇవ్వకుండా ఇబ్బందులు గురిచేస్తున్న అక్షర చిట్ ఫండ్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ శుక్రవారం చిట్‌ఫండ్స్ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహించి, కార్యాలయానికి తాళాలు వేశారు. ఏజెన్సీ ఏరియాలో చట్టాలకు విరుద్ధంగా చిట్ ఫండ్స్ నిర్వహించడమే కాక బాధితులకు డబ్బులు ఇవ్వకుండ ఇబ్బందులకు గురిచేస్తున్న అక్షర చిట్ ఫండ్స్ పై చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.