Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బూర్గంపాడు
ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న మోడీ కేంద్ర ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైనదని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు బత్తుల వెంకటేశ్వర్లు అన్నారు. మండలంలోని సారపాకలోని సీపీఐ(ఎం) కార్యాలయంలో శుక్రవారం ప్రజాసంఘాల ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సీఐటీయూ మండల కన్వీనర్ బర్ల తిరుపతి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా బత్తుల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కేంద్రంలో గల బీజేపీ పాలనలో ప్రజల మధ్య మత విద్వేషాలను రెచ్చగొడుతోందని ఆయన అన్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ 1200కి పెరిగిందని ఆయన పేర్కొన్నారు. నిత్యావసర సరుకులు దారుణంగా పెంచుతున్న బిజెపి ప్రభుత్వం ప్రజలపై మోయలేని భారాలను మోపుతుందని ఆయన విమర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ నెలలో వరంగల్ నుంచే మోటార్ సైకిల్ ర్యాలీ జాతాలు ఈనెల 17 నుండి ర్యాలీలు ప్రారంభించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ నెల 6న మండల కేంద్రంలో జనరల్ బాడీ మీటింగ్ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జరుగుతుందని ఆయన చెప్పారు. తప్పనిసరిగా ప్రజలు పాల్గొనాలని, ఈ నెల 21న భద్రాచలం మోటర్ సైకిల్ ర్యాలీ రాబోతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమాలను ప్రజలందరూ విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో వ్యకాస మండల అధ్యక్షులు ఎస్.కె అభిదా, కమటం మరియమ్మ, కెవిపిఎస్ మండల కార్యదర్శి రాయల వెంకటేశ్వర్లు, సీఐటీయూ నాయకులు ఆదూరి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.