Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అదానికి లబ్ధి చేకూర్చేందుకు
- సిలిండర్ల పై రూ.50, 150 పెంపు
- పెరుగుతున్న ధరల పై ఆడబిడ్డలు ఆలోచించాలి
- పెరిగిన ధరలు తగ్గించే వరకు చేపట్టే ఉద్యమానికి బిఆర్ఎస్ అండ
- పెంచిన గ్యాస్ ధరల్ని తగ్గించాలని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ డిమాండ్
నవతెలంగాణ - ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
భారతదేశానికి మోడీ ప్రధాని కావడం మన దురదృష్టకరమని, మూడు రాష్ట్రాల్లో ఎన్నికలు పూర్తి కావడంతో కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం మరోసారి పేద, మధ్య తరగతి ప్రజలపై ఊహించని భారాన్ని మోపిందనీ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆరోపించారు. గ్యాస్ సిలిండర్ పై రూ.50 పెంచడం పట్ల కెటిఆర్ పిలుపు మేరకు శుక్రవారం రాష్ట్ర వ్యాప్త నిరసన కార్యక్రమంలో భాగంగా ఖమ్మం జిల్లా కేంద్రం ధర్నా చౌక్ లో బీఆర్ఎస్ నగర పార్టీ అధ్వర్యంలో చేపట్టిన నిరసనలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొన్నారు. నల్ల దుస్తులు, నల్ల బ్యాడ్జీలు ధరించి, గ్యాస్ సిలిండర్ కటౌట్లు... సిలిండర్లతో.. వంట వార్పు నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. ధర్నాలో మేయర్ పునుకొల్లు నీరజ, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, సుడా చైర్మన్ బచ్చు విజరు కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ దోరేపల్లి శ్వేత, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహరా, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ లక్ష్మీప్రసన్న, టీఆర్ఎస్ నగర అధ్యక్షులు పగడాల నాగరాజు, కార్పొరేటర్లు కమర్తపు మురళి, శ్రీవిద్య, లక్ష్మి, విజయనిర్మల, సరిత తదితరులు పాల్గొన్నారు.
వైరా : ఎనిమిది సంవత్సరాలుగా నరేంద్ర మోడీ దేశంలో దుర్మార్గ పాలన సామాన్య ప్రజలను ఆర్థికంగా గుల్ల చేస్తుందని వైరా ఎమ్మెల్యే లావుడియా రాములు నాయక్ ద్వజమెత్తారు. శుక్రవారం గ్యాస్ ధర పెంపును నిరసిస్తూ బిఆర్ఎస్, సీపీఎం, సిపిఐ పార్టీలు స్థానిక క్రాస్ రోడ్డులో నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి క్రాస్ రోడ్ వరకు ర్యాలీ నిర్వహించారు. గిరిజన మహిళలు వారి సాంప్రదాయక దుస్తులతో గ్యాస్ సిలిండర్లతో ర్యాలీలో పాల్గొన్నారు. అక్కడ కట్టెల పొయ్యి తో వంటా వార్పు నిర్వహించారు. సీపీఎం, సిపిఐ పార్టీలు తమ కార్యాలయాల నుండి ర్యాలీగా క్రాస్ రోడ్డు కు చేరుకుని నిరసనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎల్ రాములు నాయక్, సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బొంతు రాంబాబు మాట్లాడారు.. కార్యక్రమంలో ఎంపీపీ వేల్పుల పావని, జడ్పిటిసి నంబూరి కనకదుర్గ, మినిసిపల్ వైస్ చైర్మన్ ముళ్ళ పాటి సీతారాములు, సీపీఎం నాయకులు తోట నాగేశ్వరరావు, సుంకర సుధాకర్, సీపీఐ పట్టణ నాయకులు మిట్టపల్లి రాఘవరావు పాల్గొన్నారు.
సత్తుపల్లి : కేంద్రంలో అందలమెక్కిన దగ్గర నుంచి బీజేపీ ప్రభుత్వం నిత్యావసర ధరలు, పెట్రో ధరలను పెంచడమే పనిగా పెట్టుకుందని, మోదీ ప్రధానిగా ఈ తొమ్మిదేండ్ల పాలనలో లెక్కలేనన్ని సార్లు పెట్రో ధరలను పెంచి పేదల నెత్తిపై పెనుభారం మోపిందని జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మెన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, మున్సిపల్ ఛైర్మెన్ కూసంపూడి మహేశ్ విమర్శించారు. గ్యాస్ ధర పెంపుపై బీఆర్ఎస్ రాష్ట్రవ్యాప్త నిరసనల కార్యక్రమంలో భాగంగా శుక్రవారం సత్తుపల్లిలో ఆ పార్టీ శ్రేణులు కేంద్రప్రభుత్వ చర్యలపై నిరసన కార్యక్రమాన్ని నిర్వహిం చారు. కట్టెలపొయ్యిపై వంటావార్పు చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ దొడ్డా హైమవతి శంకరరావు, ఆత్మ ఛైర్మెన్ శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ చల్లగుండ్ల కృష్ణయ్య, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ఎస్కే రఫీ, నాయకులు దొడ్డా శంకరరావు, అంకమరాజు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
పెనుబల్లి : బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు కనగాల వెంకట రావు, జడ్పిటిసి చెక్కిలాల మోహన్‌రావు, ఎంపీపీ లక్కినేని అలేఖ్య వినీల్, సర్పంచులు పంతులి, తావు నాయక్, మందడపు అశోక్ కుమార్, తడికమళ్ళ తాతారావు, మల్లయ్య పాల్గొన్నారు.
కల్లూరు : బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిం చారు. ఎమ్మెల్యే సండ్ర వెంకట రయ్య ఆధ్వర్యంలో.కల్లూరు మెయిన్ సెంటర్లో మహిళలు, బిఅర్ఎస్ నాయకులు ఖాళీ గ్యాస్ బండలతో రహదారిపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.కార్యక్రమంలో జెడ్పీటీసీ కట్టా అజరు కుమార్, బిఅర్ఎస్ మండల అధ్యక్షులు పాలెపు రామారావు, రై.స.స. మండల కన్వీనర్ డా,, లక్కినేని రఘు, ఏఎంసి వైస్ చైర్మన్ కాటంనేని వెంకటేశ్వరరావు, నాయకులు బొప్పన రామారావు, జెడ్పీ, మండల కో ఆప్షన్ సభ్యులు ఎండి ఇస్మాయిల్, షేక్ కమ్లి, మండల యూత్ అధ్యక్షులు పెడకంటి రామకృష్ణ పాల్గొన్నారు.
ఎర్రుపాలెం: ఎర్రుపాలెం బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం ముందు మధిర నియోజకవర్గ ఇన్చార్జ్ జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్‌రాజ్ పిలుపు మేరకు నడిరోడ్డుపై వంట వార్పు కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమంలో ఎంపీపీ దేవరకొండ శిరీష, మండల పార్టీ అధ్యక్షులు పంబి సాంబశివరావు, కార్యదర్శి యన్నం శ్రీనివాస్‌రెడ్డి , వైస్ ఎంపీపీ సూరనేని రామకోటేశ్వరరావు, ఎంపీటీసీలు సంక్రాతి కృష్ణారావు పాల్గొన్నారు.
మధిర: కాంగ్రెస్ పార్టీ నాయకులు మధిర మున్సిపాలిటీలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహం వద్ద సిలిండర్లతో నిరసనను, వంటవార్పును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంఎల్ఏ మల్లు భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని, మధిర, ఎర్రుపాలెం మండలాల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
మధిర: అంబేద్కర్ సెంటర్లో పెంచిన గ్యాస్ ధరలకు నిరసనగా ధర్నా కార్యక్రమం టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు, మున్సిపల్ చైర్ పర్సన్ మొండితోక లత జయకర్, ఎంపీపీ మొండెం లలిత, మున్సిపల్ వైస్ చైర్మన్ శీలం విద్యాలత వెంకటరెడ్డి, మున్సిపల్ వార్డు కౌన్సిలర్ బిఆర్ఎస్ జిల్లా నాయకులు మల్లాది వాసు, బిఆర్ఎస్ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు కనుమూరు వెంకటేశ్వరరావు, అరిగే శ్రీనివాసరావు, బొగ్గుల భాస్కర్ రెడ్డి, కరివేద సుధాకర్ పాల్గొన్నారు.
వేంసూరు : మండల కేంద్రంలో టిఆర్ఎస్ మండల కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రధాన రహదారిపై ధర్నా నిర్వహించి తాసిల్దార్ నారాయణమూర్తికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు పాల వెంకటరెడ్డి, ఎంపీపీ పగుట్ల వెంకటేశ్వర రావు, కంటే వెంకటేశ్వరరావు, గుత్తా శ్రీనివాసరావు పాల్గొన్నారు.
ముదిగొండ : బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సిలిండర్లతో శుక్రవారం ముదిగొండలో రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు వాచేపల్లి లక్ష్మారెడ్డి, జడ్పిటిసి పసుపులేటి దుర్గ, బిఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి గడ్డం వెంకటేశ్వర్లుగౌడ్, నాయకులు పోట్ల ప్రసాద్, బంక మల్లయ్య, పసుపులేటి వెంకట్, ఎర్ర వెంకన్న పాల్గొన్నారు.
ఖమ్మంరూరల్ : కేంద్ర ప్రభుత్వం వంటగ్యాస్‌పై పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని సిపిఎం జిల్లా నాయకులు పొన్నం వెంకటేశ్వరరావు, మాదినేని రమేష్ అన్నారు. పెరిగిన వంట గ్యాస్ ధరలను నిరసిస్తూ సిపిఎం తెల్దారుపల్లి గ్రామ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన చేపట్టారు. కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి నండ్ర ప్రసాద్,సర్పంచ్ సిద్దినేని కోటయ్య, సిపిఎం నాయకులు తమ్మినేని వెంకట్రావు, వడ్లమూడి నాగేశ్వర రావు, రంజాన్ పాషా, యర్రా నర్సింహా రావు, బాణోత్ శ్రీను, పోతురాజు సావిత్రి, సరస్వతీ పాల్గొన్నారు.
కారేపల్లి : పేదలపై భారాలు మోపటంలో కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని బీఆర్ఎస్లు పోటీ పడుతున్నాయని కాంగ్రెస్ పార్టీ మహిళ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు పగడాల మంజుల విమర్శించారు. శుక్రవారం కారేపల్లిలో జరిగిన విలేకరుల సమావేశంలో మంజుల మాట్లాడారు.
కారేపల్లి : గ్యాస్ ధరను కేంద్రంలోని బీజేపీ పెంచటాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం కారేపల్లిలోని నిరస కార్యక్రమాన్ని చేపట్టారు. వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ ఆదేశాలతో బీఆర్ఎస్ శ్రేణులు నిరసనను చేపట్టారు. కారేపల్లి బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పెద్దబోయిన ఉమాశంకర్, ప్రధాన కార్యదర్శి ఇస్లావత్ బన్సీలాల్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ కార్యాలయం నుండి ర్యాలీ బయలుదేరిన కార్యకర్తలు కారేపల్లి బస్టాండ్ సెంటర్ చేరుకోని రాస్తారోకో నిర్వహించారు. రోడ్డుపై కట్టెలపోయిని పెట్టి వంట చేసి బీఆర్ఎస్ మహిళ కార్యకర్తలు నిరసనను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ రావూరి శ్రీనివాసరావు, మండల మహిళ అధ్యక్షరాలు బాణోత్ పద్మావతి, ఉపాధ్యక్షులు రాలు పప్పుల నిర్మల, ఎంపీటీసీ, సర్పంచ్ సంఘం అధ్యక్షులు ధరావత్ పాండ్యా నాయక్, భూక్య రంగారావు పాల్గొన్నారు.
బోనకల్ : సంక్షేమం అనే పథకానికి అర్థం లేకుండా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం చేస్తుందని రాష్ట్ర విత్తనాభివద్ధి సంస్థ కార్పొరేషన్ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు రైతు బంధు జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలకు నిరసనగా బీఆర్ఎస్ మండల కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ఖమ్మం బస్టాండ్ సెంటర్లో ఖాళీ సిలిండర్లతో శుక్రవారం నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు చేబ్రోలు మల్లికార్జునరావు మండల ప్రధాన కార్యదర్శి మోదుగుల నాగేశ్వరరావు బోనకల్ సొసైటీ అధ్యక్షులు చావా వెంకటేశ్వరరావు మాజీ సొసైటీ అధ్యక్షులు కొండపనేని సుధాకర్ రావు రైతుబంధు మండల కన్వీనర్ వేమూరి ప్రసాద్ రావు మాజీ జడ్పిటిసి బనావత్ కొండ పాల్గొన్నారు.
తల్లాడ: సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఆధ్వర్యంలో తల్లాడలో శుక్రవారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీపీ డి శ్రీనివాసరావు జడ్పిటిసి గిరిశాల ప్రమీల రైతుబంధు మండలాధ్యక్షులు, దుగ్గిదేవర వెంకటలాల్, జోనల్ చైర్మన్ దగ్గర శ్రీనివాస్ రెడ్డి ఆర్వీర్ మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.
ఖమ్మంకార్పొరేషన్ : పెంచిన గ్యాస్ ధరను వెంటనే తగ్గించాలని త్రీ టౌన్ మహిళా సంఘం కార్యదర్శి పత్తిపాక నాగ సులోచన ఆధ్వర్యంలో మహిళలతో త్రీ టౌన్ లో గ్యాస్ సిలిండర్ ఎత్తుకొని ర్యాలీ తీస్తూ నిరసన తెలిపారు. కార్యక్రమంలో పి ఉమారాణి, పి.తిరపమ్మ, పి.శ్రీ నైనా, జి పద్మ, ఎం గౌతమి, ఎం శ్రీదేవి, పి మౌనిక, పి లక్ష్మి, పి సీతమ్మ, తదితరులు పాల్గొన్నారు.
ఖమ్మంరూరల్: బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నాయుడుపేట సెంటర్ లో ఖమ్మం-సూర్యాపేట ప్రధాన రహదారిపై రాస్తారోకో, ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఖాళీ గ్యాస్ బండలతో నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండలాధ్యక్షుడు బెల్లం వేణుగోపాల్, ఎంపీపీ బెల్లం ఉమా, ఖమ్మం రూరల్ జెడ్పిటిసి యండపల్లి వరప్రసాద్, సుడా డైరెక్టర్ గూడ సంజీవరెడ్డి, అరేంపుల ఉప సర్పంచ్ బండి సతీష్, నాయకులు లక్ష్మణ్ నాయక్, కొప్పుల ఆంజనేయులు, వెంపటి రవి తదితరులు పాల్గొన్నారు.