Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వైరా మండలంలోని పలు గ్రామాలలో పాదయాత్ర
నవతెలంగాణ-వైరాటౌన్
వ్యవసాయ ఉత్పత్తుల మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించాలని, కార్మికుల లేబర్ కోడ్స్ రద్దు చేయాలని, ఉపాధి హామీ పనులకు నిధులు కేటాయించి కొనసాగించాలని, కేంద్ర ప్రభుత్వం పెంచిన వంట గ్యాస్ ధరలను తగ్గించాలని, దేశవ్యాప్తంగా రైతులందరికీ రుణమాఫీ చేయాలని, కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక, కర్షక, రైతు వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ ఏప్రిల్ 5న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతూ తెలంగాణ రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, సిఐటియు, మహిళా సంఘం ఆధ్వర్యంలో వైరా మండలం పాలడుగు, రెబ్బవరం, లింగన్నపాలెం గ్రామాలలో పాదయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు తోట నాగేశ్వరరావు, రైతు సంఘం జిల్లా నాయకులు వనమా చిన్న సత్యనారాయణ, విప్పలమడక మాజీ సర్పంచ్ పారుపల్లి కృష్ణారావు, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి తూము సుధాకర్, సిఐటియు మండల కన్వీనర్ బాజోజు రమణ, రైతు సంఘం నాయకులు ఎస్.కె జానీమియా, బాణాల కష్ణమాచారి, సిపిఐ(ఎం) పాలడుగు గ్రామ శాఖ కార్యదర్శి ఎస్.కె మజీద్, మహిళా సంఘం నాయకులు మజీద్ బి, రిహానా, ఫాతిమా, బొల్లం రామయ్య, సయ్యద్ హకీమ్, హుస్సేన్ బి, జర్రిపోతుల పుష్పరాజ్యం, యనమద్ది రామకష్ణ, టి.బాబురావు, కృష్ణ, సామినేని బాబు, నాగేశ్వరరావు, గంటమ్మ తదితరులు పాల్గొన్నారు.
చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి
చింతకాని : రైతులు, కార్మిక రంగంపై వ్యతిరేక విధానాలు అమలు చేస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై సంయుక్తంగా పోరాడేందుకు ఏప్రిల్ 5న తలపెట్టిన చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతూ చింతకాని మండలం కొదుమూరు గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం ఆల్ ఇండియా కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్రపంచీకరణ విధానాల అమలుతో రైతులకు కనీస మద్దతు ధరల దొరకడం లేదని, ఉపాధిహామీ, ఆహార భద్రత, కనీసవేతనాలు లేకుండా పోతున్నాయని వివరించారు. మోడీ చెప్పే అచ్ఛేదిన్ రైతులకు, వ్యవసాయ కార్మికులకు కాదని అన్నారు. ప్రధాని మోడీ రైతుల పోరాటాన్ని పంజాబ్లో ఒక ప్రాంతానికి చెందినదని తక్కువ చేసి మాట్లాడారని కానీ దేశవ్యాప్తంగా విస్తరించి మోడీ నోరు మూయించిందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా జరిగిన ఈ ఉద్యమంలో వ్యవసాయ కారిష్ట్రbకులు కూడా కలిసి రావడం వల్లే ఉద్యమం తీవ్రమై కేంద్రం దిగిరావాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. రైతు సంఘం జిల్లా కార్యదర్శి మాదినేని రమేష్ మాట్లాడుతూ మతోన్మాదులు, కార్పొరేట్లకు వ్యతిరేకంగా ఉద్యమానికి ఇది సరైన సమయమని వివరించారు. కార్యక్రమంలో సిఐటియూ జిల్లా నాయకులు మడిపల్లి గోపాలరావు, వ్యవసాయకార్మిక సంఘం నాయకులు వత్సవాయి జానకి రాములు, సహకార సంఘం డైరెక్టర్ మాదిన్ని రవి, రాచబంటి రాము తదితరులు పాల్గొన్నారు.