Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా
నవతెలంగాణ-కొత్తగూడెం
అర్హులైన పేదలందరికీ గృహవసతి కల్పించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట బైటాయించి ధర్నా నిర్వహించారు. పేదలకు ఇండ్లు కేటాయించాలని, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు అర్హత పొందిన వారికి ప్రభుత్వ స్థలాలు కేటాయించి, పక్కా గృహాలు నిర్మించి ఇవ్వాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగాజిల్లా కార్యదర్శి ఎస్కె.సాబీర్ పాషా మాట్లాడుతూ ఇండ్లు లేని పేదలు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకోసం కొత్తగూడెం, పాల్వంచ పట్టణాల్లో 7వేల మందికిపైగా దరఖాస్తు చేసుకున్నారని, సర్వే పేరుతో సగానికిపైగా దరఖాస్తులను బుట్టదాఖలు చేసి అర్హుల పేరుతో జాబితాను సిద్ధం చేసిన అధికారులు కేవలం డ్రా విధానంతో కేవలం 700 ఇండ్లను కేటాయించి వేలాది మందిని నిరాశకు గురిచేశారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యవర్గ సభ్యులు సలిగంటి శ్రీనివాస్, జిల్లా సమితి సభ్యులు కంచర్ల జమలయ్య, గెద్దాడ నగేష్, కె.రత్నకుమారి, ఎస్.కె.నాగుల్ మీరా, వార్డు కౌన్సిలర్లు, నాయకులు మాచర్ల శ్రీనివాస్, విజరు కుమార్ తదితరులు పాల్గొన్నారు.