Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీవీపీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు సతీష్
- తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా
నవతెలంగాణ-పాల్వంచ
గురువారం పాల్వంచలో హడావిడిగా సగం పూర్తయిన డబుల్ బెడ్ రూమ్‌ల కోసం డ్రా నిర్వహించి దానిలో వికలాంగులకు రావాల్సిన న్యాయబద్ధమైన ఐదు శాతం వాటాను కేటాయించకపోవడం దుర్మార్గమని టీవీపీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు విజేఏసి చైర్మన్ సతీష్ గుండపునేని అన్నారు. ఈ విషయమై తహసీల్దార్‌ను సంప్రదించగా శుక్రవారం తహసీల్దార్ కార్యాలయంలో వికలాంగులకు ప్రత్యేక పద్ధతి ద్వారా ఇండ్లను కేటాయిస్తామని చెప్పగా, ఆశగా వారు కార్యాలయంకు వచ్చారు.
అధికారులు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో తహసీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపి ఆందోళన చేశారు. ఈ సందర్భంగా సతీష్ గుండపునేని మాట్లాడుతూ సామాన్యుడికి సైతం ఇల్లు కట్టుకోవడం సాధ్యం కాని ఈరోజుల్లో వికలాంగులకు ఇల్లు కట్టుకోవాలనన్న ఆలోచన కూడా రాదని అలాంటిది, మొదటిగా దివ్యాంగులకు ఆత్మగౌరవంగా జీవించేలా డబుల్ ఇండ్లు కేటాయించాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు అబ్దుల్ నహీం, శ్రీను, ఆల్తాఫ్, రాంబాబు, ఫాతిమా, జురుబాబు, స్వప్న, సునీత, సాయి, బిందు, గోపి తదితరులు పాల్గొన్నారు.