Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భద్రాచలం
గ్యాస్ ధరల పెంపు పై అంబేద్కర్ సెంటర్ నందు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన చేపట్టారు. మండల అధ్యక్షులు అరికిళ్ల తిరుపతిరావు ఈ సందర్భంగా మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వ విధానాలతో ప్రజలు అనేక ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మండల వైస్ ప్రెసిడెంట్ చింతాటి చిట్టిబాబు, నర్రా రాము, మాజీ నియోజకవర్గ ఇన్చార్జి మానె రామకృష్ణ, మాజీ మండల ప్రెసిడెంట్ యశోద నగేష్, సీనియర్ నాయకులు తిప్పన సిద్ధులు, తాళ్ల రవికుమార్, ప్రమోద్ కుమార్, రవికుమార్, శ్రీనివాస్, ప్రసాద్, గ్రంథాలయం చైర్మన్ పుల్లారావు, ఎండి బషీర్, యూత్ డివిజన్ అధ్యక్షులు లోకేష్, సర్పంచ్లు, తదితరులు పాల్గొన్నారు.
చండ్రుగొండ : గ్యాస్ ధరలు తగ్గించాలని, కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరికి నిరసనగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ప్రధాన సెంటర్ నందు రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్ష కార్యదర్శులు దారా వెంకటేశ్వరరావు, ఉపతల ఏడుకొండలు, జిల్లా కో ఆప్షన్ రసూల్, ఎంపీటీసీ విజయలక్ష్మి, సర్పంచులు రనియా, పూసం వెంకటేశ్వర్లు, సొసైటీ వైస్ చైర్మన్ వెంకటనారాయణ, జిల్లా తదితరులు పాల్గొన్నారు.
అన్నపురెడ్డిపల్లి : మండల కేంద్రంలో ప్రధాన రహదారిపై కట్టెల పొయ్యితో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు సుధాకర్ రావు ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జిలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సుధాకర్ రావు మాట్లాడారు. రానున్న రోజుల్లో బీజేపీని దేశం, రాష్ట్రం నుంచి పారదోలాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో యువజన నాయుకులు భారత రాంబాబు, చల్లా రమేష్, అప్పారావు, వెంకటేశ్వర్లు, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
దుమ్ముగూడెం : గ్యాస్ ధరలు తగ్గించాలని కోరుతూ బీఆర్ఎస్ మండల కమిటీ ఆధ్వర్యంలో లకీëనగరం ప్రధాన సెంటర్లో శుక్రవారం మోదీ ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రేసు లకీë, బీఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి కణితి రాముడు, మండల అధికార ప్రతినిధి జానీపాషా, పర్ణశాల ఎంపీటీసీ తెల్లం భీమరాజు, సర్పంచ్లు మట్టా వెంకటేశ్వరరావు, భూక్యా చందు, నాయకులు కణితి లక్ష్మణ్, రాజమ్మ, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
బూర్గంపాడు : పెంచిన గ్యాస్ ధరకు వ్యతిరేకంగా మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గోపిరెడ్డి రమణారెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం, ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత, పార్టీ మండల అధ్యక్షులు గోపిరెడ్డి రమణారెడ్డిలు మాట్లాడుతూ పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని వారు డిమాండ్ చేశారు. అదేవిధంగా పీఏసీఎస్ చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు, బూర్గంపాడు, కోయగూడెం సర్పంచ్లు స్వప్న, రామలక్ష్మి, పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్, పార్టీ మండల ప్రధాన కార్యదర్శి జక్కం సుబ్రమణ్యంలు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు వెంకటేశ్వర రెడ్డి, మాజీ జెడ్పీటీసీ నరసింహారావు, చల్ల కోటి పూర్ణ, ఎఎంసి డైరెక్టర్ శ్రీను నాయక్, బిసి సెల్ అధ్యక్షులు వీర్రాజు తదితరులు పాల్గొన్నారు.
పినపాక : పినపాక మండలం ఈ.బయ్యారం క్రాస్ రోడ్ వద్ద గ్యాస్ ధరలను నిరసిస్తూ పార్టీ ప్రజా ప్రతినిధులు, మహిళలతో కలిసి నిరసన కార్యక్రమం చేపట్టారు. శుక్రవారం పార్టీ కార్యాలయం నుంచి బయ్యారం క్రాస్ రోడ్డు సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు పగడాల సతీష్ రెడ్డి మాట్లాడుతూ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళలను ఇబ్బంది పెట్టే విధంగా గ్యాస్ సిలిండర్ ధరలను పెంచింద అన్నారు. ఈ కార్యక్రమంలో మండల సీనియర్ నాయకులు, ఎంపీటీసీలు, సర్పంచులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.
ఇల్లందు : గ్యాస్ ధరలు తగ్గించాలని సీఐటీయూ ఆధ్వర్యంలో పెట్రోల్ బంక్ ఎదురుగా బిల్డింగ్ అడ్డ మీద కట్టెల పొయ్యి, గ్యాస్ బండతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బిల్డింగ్ వర్కర్స్ మండల నాయకుడు కామ నాగరాజు అధ్యక్షతన జరిగిన సభలో సిఐటియు నాయకులు తాళ్లూరి కృష్ణ, కూకట్ల శంకర్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో శ్రీను, వెంకటేశ్వర్లు, మహమ్మద్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.