Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అవకతవకలు జరిగితే ఆధారాలతో ఫిర్యాదు చేయండి
- కలెక్టర్ అనుదీప్
నవతెలంగాణ-పాల్వంచ
కొత్తగూడెం పట్టణంలో గురువారం జరిగిన రెండు పడక గదుల ఎంపిక పారదర్శకంగా అందరి ముందు వీడియో గ్రఫి ద్వారా చేయడం జరిగిందని కలెక్టర్ అనుదీప్ తెలిపారు. కొత్తగూడెం, తహశీల్దార్ కార్యాలయం తయారు చేసిన జాబితాలో ఎవరైనా అనర్హులు గాని, అధిక ఆదాయం కలిగిన వారు గాని, ఇంతకు ముందే పక్కా గృహం కలిగిన వారు గాని లాటరీలో ఎంపిక అయినట్లుయితే జిల్లా కలెక్టర్కు ఆ వ్యక్తుల పేర్లు, వివరాలతో ఫిర్యాదు చేయవచ్చని చెప్పారు. అట్టి వాటిపై విచారణ చేసి, ఫిర్యాదు నిజమని నిర్ధారణ అయినచో లబ్దిదారుల పేర్లు జాభితా నుండి తొలగించడం జరుగుతుందని చెప్పారు. అదనపు కలెక్టర్ (9392919700) లేదా జిల్లా రెవెన్యూ అధికారి (9392919702)కి అనర్హులు పేర్లు వారి పూర్తి వివరాలతో ఫిర్యాదు చేయవలసిందిగా ఆయన సూచించారు. పారదర్శక ఎంపిక ద్వారా లబ్ధిదారుల సమక్షంలో చేపట్టిన లాటరీలో ఎట్టి పరిస్థితిలో అనర్హులకు రెండు పడక గదుల ఇళ్ళు కేటాయింపు జరుగదని ఆయన స్పష్టం చేశారు.