Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మోరంపల్లి బంజర పీహెచ్సీ వైద్యాధికారిణి డాక్టర్ పి.స్పందన
నవతెలంగాణ-బూర్గంపాడు
అసంక్రమిత వ్యాధులపై అవగాహన కలిగి ఉండాలని మోరంపల్లి బంజర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి డాక్టర్ పి.స్పందన అన్నారు. మండలంలోని మోరంపల్లి బంజర, పీహెచ్సిలో బూర్గంపాడు, భద్రాచలం, పర్ణశాల, దుమ్ముగూడెం పీహెచ్సీ పరిధిలోని ఆశాలకు అసంక్రమిత వ్యాధులపై శిక్షణ తరగతులు నిర్వహించారు. శనివారం ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఈ వ్యాధులపై ఆశాలు పూర్తిస్థాయిలో అవగాహన కలిగి ఉండాలని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో శిక్షణ ట్రైనర్స్ సీహెచ్ఓ పి.కాంతమ్మ, హెచ్.వి.సద్గుణవాణి శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ఓ బి.సోమ్లా, హెచ్.ఈ.ఓ.బి.రవి, హెచ్.బి.సడాల దేవి, హెచ్.వి భవాని తదితరులు పాల్గొన్నారు.