Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిర్మాణాల ప్రక్రియ పూర్తికాకుండా గృహాలను కేటాయించడం సరికాదు
- కౌన్సిలర్ మునిగడప పద్మ
నవతెలంగాణ-కొత్తగూడెం
కొత్తగూడెం మున్సిపల్ పరిధిలోని, పాత కొత్తగూడెంలో నిర్మాణాలు జరుగుతున్న డబుల్ బెడ్ రూమ్ల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేసి డ్రాలో అర్హత సాధించిన లబ్ధిదారులకు డబల్ బెడ్ రూమ్ల లబ్ధిదారులకు గృహప్రవేశ నిర్వహించాలని సీపీఐ పదో వార్డ్ కౌన్సిలర్ మునిగడప పద్మ అధికారులకు విజ్ఞప్తి చేశారు. నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణాలు శనివారం పరిశీలించారు. అసంపూర్తిగా ఉన్న ఆ నిర్మాణాల ప్రక్రియను చూసిన లబ్ధిదారులు అవాక్కాయ్యారు. గత 5 సంవత్సరాల నుండి నిర్మాణ ప్రక్రియ జరుగుతున్నప్పటికీ నేటికీ నిర్మాణాలు పూర్తి కాకపోవడం, ఇప్పుడు మాకు కేటాయించిన గృహాలు ఎప్పుడు పూర్తయితాయో అర్థం కాని పరిస్థితి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ ఫోర్ లీడర్ మునిగడప వెంకటేశ్వర్లు, సిపిఐ నాయకులు కొత్తూరు సుధాకర్, కొచ్చర్ల కిరణ్, దుర్గ సురేష్, ప్రేమ్, గాడి దాసి కుమార్, జిల్లాల చింటూ, నసీం, ఆసియా బేగం, వేల్పుల సరస్వతి, చింతల విజయ, దొంగ హేమలత, నాగమణి, బేగం తదితరులు ఉన్నారు.