Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ నాయకులు అర్జున్
నవతెలంగాణ-అశ్వారావుపేట
వ్యవసాయ యూనివర్సిటీ కార్యకలాపాల నిర్వహణలో టైం స్కేల్ సిబ్బంది కృషి ఎంతో కీలకమైనది అని, వీరికి కనీస వేతనం చట్టబద్ధమైన సౌకర్యాలు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించకపోవడం అన్యాయమని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు పిట్టల అర్జున్ అన్నారు. తెలంగాణ యూనివర్సిటీ ఎంప్లాయిస్, వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సమస్యల పై సంతకాలు సేకరించి ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ స్థానిక వ్యవసాయ కళాశాల కార్యాలయంలో పరిపాలన అధికారి జయమ్మకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా అర్జున్ మాట్లాడుతూ గత ఆరు సంవత్సరాల నుండి వేతనాలు పెరగలేదని, వివిధ డిపార్ట్మెంట్లలో పనిచేస్తున్న కార్మికులకు తమ అర్హతలను బట్టి ప్రమోషన్లు ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర కమిటీ సభ్యులు సలారు, యాకూబ్ అలి, దుర్గారావు, ఇస్మాయిల్, వెంకటలక్ష్మి, నర్సమ్మ, అమీర్ బక్షీ, తిరుపతి రెడ్డి పాల్గొన్నారు.