Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- త్వరలో ప్రారంభించనున్న మంత్రి పువ్వాడ
- రవాణేతర వాహన దారులకు తగ్గనున్న దూరాభారం
నవతెలంగాణ-అశ్వారావుపేట
అశ్వారావుపేట ప్రాంతం రవాణేతర వాహన వినియోగదారులు ఎన్నాళ్ళు నుండో ఎదురు చూస్తున్న మోటార్ వాహన తనిఖీ అధికారి కార్యాలయం ఏర్పాటు సాకారం అయింది. అశ్వారావుపేట నియోజక వర్గం కేంద్రంగా ఏర్పడిన నాటి నుండి ఈ కేంద్రంలో ఏర్పాటు కావాల్సిన కార్యాలయాలు నేటికీ ఏర్పాటు కాకపోవడం ఒకింత విచారం అనే చెప్పుకోవాలి. ఈ ప్రాంతం ప్రజలు అవసరాలు, వాటిని ప్రతిబింబించే మీడియా రాతలు, వీటికి స్పందించిన స్థానిక ప్రజాప్రతినిధులు ప్రతిఫలంగా ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు కృషితో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చలువతో ఎట్టకేలకు ఎంవిఐ కార్యాలయం ఏర్పాటు కానుంది. పట్టణంలోని మూడు రోడ్ల కూడలి సమీపంలో గల మండల పరిషత్ పూర్వ కార్యాలయం అనుబంధ అతిధి గృహంలో ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇటీవల మండల పర్యటనకు వచ్చిన మంత్రి అజరు త్వరితగతిన కార్యాలయం ఏర్పాటు చేసి ప్రారంభించాలని రవాణా శాఖ అధికారులను ఆదేశించడంతో ఎం.వి.ఐ జయ పాల్ రెడ్డి పర్యవేక్షణలో పనులు చకచకా నిర్వహిస్తున్నారు. ఈ నెల 7న ప్రారంభానికి ఏర్పాట్లు జరుగుతున్నవి. రవాణేతర వాహనాలకు అందజేసే అన్ని సేవలు ఈ కార్యాలయంలో అందుబాటులోకి వస్తాయని ఎం.వి.ఐ జయ పాల్ రెడ్డి తెలిపారు.