Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జి.భానుమతి
నవతెలంగాణ-కొత్తగూడెం
సమాజ నిర్మాణంలో సగభాగమైన స్త్రీ సమానత్వమే ప్రగతికి మూలమని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జి.భానుమతి అన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి, చైర్మన్ పి.చంద్రశేఖర ప్రసాద్ ఆదేశాల మేరకు శనివారం కొత్తగూడెం మున్సిపల్ ఆఫీస్ మీటింగ్ హాల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా న్యాయ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ కార్యదర్శి జి.భానుమతి మాట్లాడారు. ఆకాశంలో సగం అవకాశంలో సగం అంటూ నేడు మహిళలు అని రంగాల్లో రాణిస్తున్నారని న్యాయమూర్తి తెలిపారు. సమాజంలో మహిళలు ఆత్మగౌరవంతో స్వశక్తితో తమ ఆర్థిక అవసరాలను తామే తీర్చుకోగలిగే విధంగ ఉన్నత స్థాయికి ఎదగాలని కోరారు. స్త్రీ సృష్టికి మూలమని కొనియాడారు. మహిళా దినోత్సవ వారోత్సవాలలో భాగంగా మార్చి 4 నుండి మార్చి 11 వరకు న్యాయ అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. డిస్టిక్ వెల్ఫేర్ ఆఫీసర్ స్వర్ణ లేనినా మాట్లాడుతూ.. ఐసీడీఎస్ ద్వారా బాలింత మహిళలకు నాణ్యమైన పోషకాహారమును అందిస్తున్నామని, ఆహారం ఆరోగ్యం, భద్రత పట్ల తమ సంస్థ కృషి చేస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కొత్తగూడెం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అనుబ్రోలు రాంప్రసాదరావు, మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతా మహాలక్ష్మి, న్యాయవాది లక్కినేని సత్యనారాయణ, మహిళా ప్రతినిధి గాదె సునంద, మునిగడప వెంకటేశ్వర్లు, భానుప్రియ, కాసాని రమేష్, మెండు రాజమల్లు, తోట మల్లేశ్వరరావు, ఎంపీపీ బాదావత్ శాంతి, జడ్పిటీసీ మేరెడ్డి వసంత, సాదిక్ పాషా, మునగడప పద్మ, సత్య భామ, సఖి టీమ్, ఎంపీపీలు, ఎంపీటీసీ, జడ్పీటీసీలు, మహిళా ప్రతినిధులు పాల్గొన్నారు.