Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వేసవిలో మొక్కల సంరక్షణకు చర్యలు చేపట్టాలి
- పామాయిల్ సాగు లక్ష్యాన్ని చేదించాలి
- కలెక్టర్ అనుదీప్
నవతెలంగాణ-పాల్వంచ
జిల్లాల్లో తెలంగాణ హరితహారంలో మొక్కలు నాటేందుకు వార్డుల వారిగా ప్రణాళికలు తయారు చేయాలని కలెక్టర్ అనుదీప్ అధికారులను ఆదేశించారు. శనివారం పాల్వంచలోని కలెక్టరేట్లో రెవెన్యూ, అటవీ, డీఆర్డిఓ, ఉద్యాన శాఖ, మున్సిపల్ అధికారులతో హరితహారం వేసవిలో మొక్కలు సంరక్షణ చర్యలు జీవో నంబర్ 59, 76 తదితర అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీలు గ్రామపంచాయతీలో ఏర్పాటు చేసిన నర్సరీలో మొక్కలు పెంపకం పై నివేదిక అందజేయాలని డీఆర్డిఓకు సూచించారు. మొక్కలు మొలకెత్తకపోతే వాటి స్థానంలో నారుతో మొలిచిన మొక్కలను పెట్టాలని చెప్పారు. ఈ దఫా జరగనున్న హరితహారంలో నర్సరీలు అటవీశాఖ ఆధ్వర్యంలో పెంచిన మొక్కలను వేయాలని, బయట నుండి కొనుగోలు చేసేందుకు అనుమతి ఇవ్వనని ఆయన స్పష్టం చేశారు. జీవో నెంబర్ 59, 76 ఇంటి స్థలాల గ్రామబద్దీకరణకు వచ్చిన దరఖాస్తుల్లో 59, 47, 76లో పెండింగ్ ఉన్న 98 దరఖాస్తులు విచారణ ప్రక్రియను పూర్తి చేయాలని చెప్పారు. విచారణ ప్రక్రియ పారదర్శకంగా జరిగేందుకు ముగ్గురు అధికారులతో కమిటీ ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు. జీవో 59లో 358 స్థలాలకు మార్కెట్ విలువ ప్రకారం చెల్లింపు చేయాలని డిమాండ్ నోటీసులు జారీ చేశామని, నోటీసులు అందుకున్న యజమా నులు సత్వరమే ప్రభుత్వ ఖజానాకు నిధులు చెల్లింపు చేయాలని చెప్పారు. నర్సరీలో మొక్కలు సంరక్షణకు షెడ్డు, నెట్లు ఏర్పాటు చేయాలని చెప్పారు. అడవీ శాఖ ద్వారా పెంచుతున్న మొక్కలు వివరాలు అందజేయాలని చెప్పారు. రెవెన్యూ ప్లాంటేషన్లో ఏడు అడుగుల పై ఉన్న మొక్కలు మాత్రమే నాటాలని చెప్పారు. పామాయిల్ సాగు గుర్తించి ప్రస్తావిస్తూ జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరం 16860 ఎకరాల్లో పామాయిల్ సాగు చేపట్టాలని లక్ష్యం కేటాయిం చుకోగా ఇప్పటివరకు 14003 ఎకరాల్లో మొక్కలు నాటే కార్యక్రమం పూర్తయిందని మిగిలిన 2857 మొక్కలు నాటే ప్రక్రియను రానున్న 15 తేదీ నాటికి పూర్తి చేయు విధంగా చర్యలు తీసుకోవాలని ఉద్యాన వ్యవసాయ అధికారులకు సూచించారు. ఈ సమా వేశంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, డిఆర్డిఓ మధు సూదన్ రాజు, వ్యవసాయ అధికారి అభిమన్యుడు, ఉద్యాన అధికారి జినుగు మరియన్న, డీపీఓ రమా కాంత్, ఇల్లందు డీఎఫ్ఓ నీరజ్ కుమార్, డీఆర్ఓ అశోక్ చక్రవర్తి, కొత్తగూడెం, భద్రాచలం ఆర్డీవోలు స్వర్ణలత, రత్న కళ్యాణి, పాల్వంచ, ఇల్లందు తహసీల్దార్లు రంగప్రసాద్, కృష్ణవేణి పాల్గొన్నారు.