Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంపీపీ బానోత్ పార్వతి
నవతెలంగాణ-చండ్రుగొండ
నేటి మహిళలు సమాజంలో పురుషులతో పాటు సమానంగా అన్ని రంగాల్లో ముందుండాలని ఎంపీపీ బానోత్ పార్వతి అన్నారు. శనివారం చండ్రుగొండ రైతు వేదికలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ముందస్తు జాతీయ మహిళా దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా మండలంలో ప్రభుత్వ ఉద్యోగులుగా బాధ్యతలు నిర్వహిస్తున్న మహిళా ఉద్యోగులను శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎంపీపీ బానోత్ పార్వతి మాట్లాడుతూ... నేడు ప్రపంచవ్యాప్తంగా మహిళలు లింగ వివక్షకును ఎదుర్కొని పురుషులతో పాటు సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారన్నారు. మహిళలు అనే భావము లేకుండా చదువుతోపాటు క్రీడల్లో కూడా రాణించాలన్నారు. ముఖ్యంగా బాల్యవివాహాలు జరగకుండా గ్రామాల్లో అంగన్వాడి టీచర్లు పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కో ఆప్షన్ సభ్యులు సయ్యద్ రసూల్, సర్పంచ్ దిబ్బెందుల బాబురావు, ఎంపీడీవో అన్నపూర్ణ, సిడిపిఓ నిర్మల జ్యోతి, మండల వైద్యాధికారిని డాక్టర్ కనకం తనూజా, ఎంపీటీసీ లంక విజయలక్ష్మి, కేజీబీవీ స్పెషల్ ఆఫీసర్ కాంత కుమారి, ఐసిపిఎస్ ఆఫీసర్ వినోద్ కుమార్, సఖి కేంద్రం సభ్యులు సువాసిని, సునీత, బి వసంత, ఐసిడిఎస్ సూపర్వైజర్లు, అంగన్వాడి టీచర్లు పాల్గొన్నారు.