Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ రాజగోపాల్
నవతెలంగాణ-పాల్వంచ
కర్మాగారంలో భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ బి.రాజగోపాల్ అన్నారు. శనివారం కొత్తగూడెం ధర్మల్ పవర్ స్టేషన్ ఐదవ దశ ఎంఆర్సీ సమావేశం హాల్లో ''జాతీయ భద్రతా వారోత్సవాల''లొ భాగంగా కేటీపీఎస్-5, 6 దశలలో 52వ 'జాతీయ భద్రతా దినోత్సవాన్ని'' చీఫ్ ఇంజనీర్ ఎం.ప్రభాకర రావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాజగోపాల్ కేటీపీఎస్ 5, 6 దశలలో భద్రతా దినోత్సవాన్ని ఇంత ఘనంగా నిర్వహించి కార్మికులకు భద్రతపై అవగాహన కల్పిస్తున్న చీఫ్ ఇంజనీర్‌కు, అలాగే సేఫ్టీ విభాగం వారిని అభినందిస్తూ కర్మాగారంలో ఇకముందు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చూడాలని చెబుతూ పలు సూచనలు చేశారు. అలాగే కర్మాగార, కార్మిక భద్రత పై నిర్వహించిన స్లోగన్లు, వ్యాసరచన పోటీలలోని విజేతలకు బహుమతి ప్రధానం చేశారు. చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఎం.వెంకన్న, సిహెచ్ నితిన్ కుమార్, కేటీపీఎస్ ఏడోదశ చీఫ్ ఇంజనీర్ వెంకటేశ్వరరావు, ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ చీఫ్ ఇంజనీర్ శ్రీనివాస్ బాబు, ఎస్సీలు వి.వెంకటేశ్వర్లు, టి.సత్యనారాయణ, జివి.ధర్మారావు, పి.కృష్ణ, సీసీఏపీ రామారావు, ఎస్పీఎఫ్ ఏసీసీ అంజయ్య, డిసేఫ్టీ ఎస్.నాగయ్య, ఫైర్ ఆఫీసర్ వైస్.శ్రీనివాసరావు, రాధాకృష్ణ, ఇంజనీర్లు, కార్మికులు ఆర్టీసీలు తదితరులు పాల్గొన్నారు.