Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బూర్గంపాడు
ప్రమాదంలో మరణించిన బీఆర్ఎస్ కార్యకర్తలకు బీమా పథకం కుటుంబాలకు అండగా ఉంటుందని విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. మణుగూరు మండలంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బూర్గంపాడు మండలం సోంపల్లి గ్రామానికి చెందిన ధనుసూరి పుల్లయ్య ఇటీవల ప్రమాద శాత్తు మరణించడంతో వీరికి బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం ఉండడంతో ప్రమాద బీమా వర్తించింది. ఈ సందర్భంగా ఈ చెక్కులను ఒక్కొక్క కుటుంబానికి రూ.2 లక్షల చెక్కును బాధిత రేగా అందజేసి, మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు గోపిరెడ్డి రమణారెడ్డి, పార్టీ మండల నాయకులు వీర్రాజు, శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.