Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నాణ్యత పాటించాలి : భూక్య మంగ్యా నాయక్
నవతెలంగాణ-చర్ల
మండల వ్యాప్తంగా అనుమతులు వచ్చిన మహాత్మా గాంధీ జాతీయ సేవా చట్టం (ఎన్ఆర్ఈజీఎస్) కింద సుమారు కోటి 36 లక్షల సిమెంట్ రోడ్ల పనులను పంచాయతీరాజ్ ఈఈ భూక్య మంగ్యా నాయక్ శనివారం పరిశీలించారు. అభివృద్ధి పనులలో భాగంగా మండలానికి ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో పనులు చేపట్టడం జరుగుతుందని, నాణ్యత ప్రమాలను పాటించి పనులు చేపట్టాలని ఆయన సూచించారు. ఆయనతోపాటు మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ కాపుల కృష్ణార్జునరావు, ఉప సర్పంచ్ శివ లక్ష్మీనారాయణ, వార్డు సభ్యులు దొడ్డిహరి నాగవర్మ, జేఈ రిషి నాయక్ తదితరులు ఉన్నారు.
సాదా సీదాగా సర్వసభ్య సమావేశం
నవతెలంగాణ-కామేపల్లి
మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ బానోత్ సునీత రాందాస్ నాయక్ అధ్యక్షతన శనివారం సర్వసభ్య సమావేశం సాదాసీదాగా కొనసాగింది. వేసవిలో అధికారులు ప్రజాప్రతినిధులను సమన్వయం చేసుకుంటూ నీటి ఎద్దడి రాకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో, ఈఈపిఆర్ డి.వెంకట సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.