Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మల్టీ పర్పస్ వర్కర్స్కు సరిగా జీతాలు ఇవ్వని వైనం
- చేసిన పనులకు బిల్లులు చేయని కార్యదర్శి
నవతెలంగాణ-దుమ్ముగూడెం
చింతగుప్ప గ్రామపంచాయితీలో పల్లె ప్రకృతి వనం పై పంచాయతీ అధికారుల నిర్లక్షం అనే నవతెలంగాణ పత్రికలో వచ్చిన కధనానికి గ్రామ పంచాయతీ సర్పంచ్ కట్టం కృష్ణ స్పందించారు. పల్లె ప్రకృతి వనంలో ఎండలకు వాడుతున్న మొక్కలను సంరక్షణ బాధ్యత తనదేనని తెలుసుకుని వన సేవకుడిగా మారి గత రెండు రోజులుగా పల్లె ప్రకృతి వనంలో ఉన్న చెత్తా చెదారాన్ని తొలగించడంతో పాటు మొక్కల చుట్టూ గోతులు తవ్వి వాటికి నీళ్లు పడుతూ పల్లె ప్రకృతి వనంలో వేసిన మొక్కలు ఎండి పోకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఈ సందర్బంగా సర్పంచ్ కట్టం కృష్ణ నవతెలంగాణతో మాట్లాడుతూ... గ్రామపంచాయతీలో మల్లీ పర్పస్ వర్కర్స్కు నెల నెలా జీతాలు అందజేయక పోవడంతో వారు పనులకు రావడం లేదని నవతెలంగాణ పత్రికలో వచ్చిన కధనానికి తానే స్వయంగా మొక్కలను సంరక్షించే భాద్యత తీసుకున్నట్లు తెలిపారు. దీంతో పాటు పంచాయతీ పరిధిలో పంచాయతీ పాలకమండలి ఆమోదంతో చేసిన పనులకు బిల్లులు చేసే విషయంతో గ్రామపంచాయతీ కార్యదర్శి సకాలంలో బిల్లులు చేయకుండా ఇబ్బందులకు గురి చేయడం వలన పంచాయతీ అభివృద్ధి సైతం కుంటు పడుతుందని ఆయన తెలిపారు.