Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అన్ని వార్డులు అద్దంలా మెరిపిస్తాం
నవతెలంగాణ-ఇల్లందు
మున్సిపాలిటీలోని 24 వార్డుల్లో ఇప్పటికే అభివృద్ధి పనులు జరిగాయి. ఇటీవల మరో రూ.50 కోట్లు మంజూరయ్యాయని అన్ని సౌకర్యాలు కల్పిస్తూ వార్డులను అద్దంలా మెరిపిస్తామని ఎమ్మెల్యే హరిప్రియ అన్నారు. వార్డుల-పర్యటన కార్యక్రమంలో భాగంగా శనివారం మున్సిపల్ పరిధిలోని 18వ వార్డులో ఎమ్మెల్యే హరిప్రియ పర్యటించారు. ప్రజలను కలుసుకొని సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వార్డులో కలియ తిరుగుతూ ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ రోడ్లను డ్రైనేజీలను పరిశీలించి నూతనంగా సీసీ రోడ్లు సైడ్ డ్రైనేజీ మంజూరు చేస్తానని ఎమ్మెల్యే అన్నారు. పారిశుధ్య డ్రైనేజీ సమస్యలను స్థానికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. స్పందిస్తూ అధికారులు ప్రజల సమస్యల విషయంలో ఏ మాత్రం అలసత్వం వహించవద్దని, వెంటనే సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గ్రంధాలయ సంస్థ చైర్మన్ దిండుగాల రాజేందర్, మున్సిపల్ వైస్ చైర్మన్ సయ్యద్ జానీ పాషా, రైతుబంధు సమన్వయ సభ్యులు పులిగండ్ల మాధవరావు, కమిషనర్ అంకుశవాలి, మునిసిపల్ పాలకవర్గ కౌన్సిలర్స్, కొక్కు నాగేశ్వరావు, తోట లలిత శారద, చీమల సుజాత, తార, సరిత, చీమల సుజాత తదితరులు పాల్గొన్నారు.