Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) పట్టణ కార్యదర్శి లిక్కి బాలరాజు
నవతెలంగాణ-కొత్తగూడెం
అర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు దక్కేవరకు పోరాటం చేస్తామని సీపీఐ(ఎం) టౌన్ కార్యదర్శి లిక్కి బాలరాజు అన్నారు. గురువారం లబ్దిదారుల ఎంపికలో అక్రమాలు జరిగాయని, నిజమైన పేదలకు డబల్ బెడ్ రూమ్ ఇండ్లు రాలేదని బాధితులు మున్సిపల్ కార్యాలయం ముందు చేస్తున్న ధర్నాకు సీపీఐ(ఎం) సంఘీభావం తెలిపింది. మున్సిపల్ కార్యాలయం ముందు బైఠాయించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వార్డు కౌన్సిలర్లు అనర్హుల నుండి లక్షలాది రూపాయలు తీసుకుని ఇండ్లు కేటాయిం చారని పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా లిక్కి బాలరాజు మాట్లాడుతూ డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో అవకతవకలు జరిగాయని, అధికార పార్టీ కౌన్సిలర్లు తమకు అనుకూ లమైన వ్యక్తులకు ఇల్లు కేటాయించారని ఆరోపించారు. లబ్ధిదారులు ఎంపిక పారదర్శకంగా జరిగిందని అని కలెక్టర్ చేప్పే ప్రకటనలో వాస్తవం లేదని విమర్శించారు. పారదర్శకంగా జరిగితే అర్ధరాత్రి ఒకరోజు ముందు లబ్ధిదారుల లిస్టు తయారు చేయాల్సిన అవసరం ఏమొ చ్చిందని నేరుగా ప్రశ్నించారు. సంఘీభావం తెలిపిన వారిలో జిల్లా కమిటీ సభ్యులు భూక్య రమేష్, పట్టణ కమిటీ సభ్యులు డి.వీరన్న, నందిపాటి రమేష్ తదితరులు పాల్గొన్నారు.
అవినీతి పై ఏసీబీ విచారణ జరిపించాలి : కామేష్
కొత్తగూడెం మున్సిపల్ పరిధిలో ఇటీవల జరిగిన డబుల్ బెడ్ రూం ఇండ్ల కేటాయింపులో జరిగిన అవినీతిపై ఏసీబీ విచారణ జరిపించాలని బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం మున్సిపల్ కార్యాలయం ఎదుట బైఠాయించి డబుల్ బెడ్ రూం ఇండ్లు రాని 21, 22వ వార్డులలోని బాధితులు చేస్తున్న ధర్నాలో పాల్గొని మాట్లాడారు. వార్డు కౌన్సిలర్ భర్త రూ.1 లక్ష అడిగిన ఆడియో వైరల్ అయిందని, నేటికి అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం వెంటనే స్పందించి భాద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అధికారులు పట్టించుకోరా..? : నాగా సీతారాములు
కొత్తగూడెం మున్సిపాలిటిలో డబుల్ బెడ్ రూమ్ల లబ్ధిదారుల ఎంపికలో జరిగిన అవకతవకలు కలకలం రేపుతున్న అధికారులు నిమ్మకు నీరెత్తకుండా ఉండటం శోచనీయమని టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు అన్నారు. మున్సిపల్ కార్యాలయం ముందు పేద మహిళలు చేస్తున్న ధర్నాకు సంఘీభావం తెలిపారు. ఈ దందాలో ప్రజా ప్రతినిధులపై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు నిష్పక్షపాతంగా విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.