Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కారేపల్లి
మహిళలు చట్టాలపై అవగాహన కల్గి ఉండాలని ఐసీడీఎస్ సీడీపీవో దయామణి అన్నారు. శనివారం కారేపల్లి మండలం అప్పాయిగూడెం రైతు వేదికలో జిల్లాకలెక్టర్ అదేశాలతో లీగల్ సెల్ ఆథారిటీ, ఐసీడీఎస్ ఆధ్వర్యంలో మహిళ చట్టాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ అవగాహన సదస్సులో సీడీపీవో మాట్లాడుతూ సమాజంలో మహిళలపై హింస, అణచివేతకు నడుస్తుందని దీనిని ఎదురించే శక్తిని మహిళలు చట్టాలు కల్పిస్తున్నాయన్నారు. గృహహింస, మ్యారేజ్ యాక్ట్, నిర్భయ చట్టాలపై లీగల్ సెల్ న్యాయవాదులు స్వప్న, కళ్యాణిలు వివరించారు. ఈకార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్లు రమాదేవి, సుభద్ర, రోహిణి, పుష్ప, రాధ తదితరులు పాల్గొన్నారు.