Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎడ్ల బండ లాగు ప్రదర్శనలును ప్రారంభించిన ఎమ్మెల్యే సండ్ర
నవతెలంగాణ-వేంసూరు
ఒకప్పుడు ఒంగోలు జాతి పశుసంపదకు ప్రసిద్ధిగాంచిన తెలుగు రాష్ట్రాలలో నేడు అంతరించిపోతు న్నాయని కాపాడుకునే బాధ్యత మన అందరి పైన ఉందని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అన్నారు. మండల పరిధిలోని కందుకూరు శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహౌత్సవ సందర్భంగా గ్రామస్తులు సహకారంతో ఏర్పాటు చేసిన ఒంగోలు జాతి ఎడ్ల బండ లాగు ప్రదర్శనను ఆదివారం గ్రామంలో ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఒంగోలు జాతిని నేడు బ్రెజిల్ నుండి దిగుమతి చేసుకునే స్థితికి వచ్చామని మన జాతి సంపదలను కాపాడుకోవాలని సాంప్రదాయంతో కందుకూరులో ఈ పోటీలను ప్రదర్శించి వాటి ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేసేందుకు ఈ ప్రదర్శనలు ఎంతగానో ఉపయోగపడతాయని అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల స్థాయిలో గుర్తింపు తీసుకొచ్చేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. నేడు ఈ ప్రదర్శనలు తినిపించేందుకు రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు హాజరవుతారని ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. సురపనేని రాధాకృష్ణ రిఫరీ ఆధ్వర్యంలో ప్రారంభమైన ఈ ఎడ్ల బండలాగు పోటీలకు రెండు తెలుగు రాష్ట్రాల నుండి ఇప్పటివరకు పది జతల ఎడ్లు సిద్ధంగా ఉన్నాయని అన్ని విభాగాల్లో ప్రదర్శనలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. కమిటీ సభ్యులైన మందపాటి వెంకట్ రెడ్డి, జగదీష్ రెడ్డి, రాయల సత్యనారాయణ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు డివిజన్ స్థాయిలో ఉన్న ఐదుగురు ఎస్ఐలు ఇద్దరు సిఐలు ఏఎస్ఐలతో పాటు 70 మందికి పైగా పోలీసులు మూడు రోజులపాటు భద్రత ఏర్పాట్లు చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పగుట్ల వెంకటేశ్వరరావు, బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు పాల వెంకటరెడ్డి, నిర్వాహకులు మందపాటి వెంకటరెడ్డి, జగదీష్ రెడ్డి, కంటి వెంకటేశ్వరరావు, గుత్తా శ్రీనివాసరావు, సర్పంచ్ బూరుగు నాగేశ్వరరావు, డిసిసిబి డైరెక్టర్ గొర్ల సంజీవరెడ్డి, కూరపాటి నాని, మహేశ్వర్ రెడ్డి, గొర్ల శ్రీనివాసరెడ్డి, దొడ్డ వెంకట కృష్ణారెడ్డి, గొర్ల ప్రభాకర్ రెడ్డి, పాల్గొన్నారు.