Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మం
నగరంలోని ఈనెల 8న జరిగే అంతర్జాతీయ మహిళా దినోత్సవంను పురస్కరించుకుని ఆదివారం నుంచి 8వరకు జరిగే క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా టీఎన్జీవోస్ యూనియన్ జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు షేక్.అప్జల్ హసన్, ఆర్వి ఎస్.సాగర్ల నేతృత్వంలో మహిళా విభాగం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శాబాసు జ్యోతి, స్వప్న ఆధ్వర్యం లో సర్దార్ పటేల్ స్టేడియంలో మహిళా ఉద్యోగులకు నిర్వహించిన క్రీడలను జిల్లా అడిషనల్ కలెక్టర్ ఎన్.మధుసూధన్ జ్యోతి ప్రజ్వలన చేసి, జెండా ఊపి క్రీడా పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా టీఎన్జీవోస్ యూనియన్ ఆధ్వర్యంలో ప్రతి సందర్భాన్ని విన్నూత్నంగా నిర్వహిస్తున్న జిల్లా అధ్యక్షులు అప్జల్ హసన్ ఉద్యోగుల సమస్యల పట్ల వారి పక్షాన నిలబడటమే కాకుండా ఉద్యోగుల్లో ఐక్యతను చాటేందుకు దోహదపడే క్రీడాపోటీలను నిర్వహించడం పట్ల అప్జల్ హాసన్‌ని అభినందించారు. సంవత్సర కాలమంతా తీవ్ర పని ఒత్తిడితో ఉండే మహిళ మణులకు ఈ ఆటలపోటీలు ఆట విడుపును ఇస్తాయని తెలిపారు. మొదటిరోజు రన్నింగ్ కబడ్డీ, టెన్నికాయిట్ స్కిప్పింగ్, టగ్ అఫ్ వార్, లెమన్ స్పూన్, పోటీలలో మహిళా ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవోస్ యూనియన్ రాష్ట్ర అర్గనైజింగ్ సెక్రెటరీ నందగిరి శ్రీను, జిల్లా అసోసియేట్ ప్రెసిడెంట్ సుంచు వీరనారాయణ, ట్రెజరర్ భాగం పవన్, టౌన్ అధ్యక్షులు షేక్.నాగుల్ మీరా, జిల్లా,టౌన్ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రెటరీలు బుద్దా రామకృష్ణ, ఆర్.ఎన్.ప్రసాద్, రఘునాధపాలెం ఫోరమ్ ప్రెసిడెంట్ సాయి శిరణ్మయి, ఫోరమ్స్ అధ్యక్ష, కార్యదర్శులు మెడికల్ అండ్ హెల్త్ ఫోరమ్ అధ్యక్ష, కార్యదర్శులు కె.రమేష్ బాబు, ఐ. వెంకటేశ్వర్లు, అసోసియేట్ ప్రెసిడెంట్ ఎండీ. వలి, ట్రెజరర్ జి.పురుషోత్తంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.