Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
కోవిడ్ నుంచి కోలుకున్నా పలు రకాల అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్న మేకల హరీష్‌కు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర రూ.25 వేల ఆర్థిక సాయం అందించారు. తన తరపున ఆ మొత్తాన్ని మున్నూరు కాపు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆకుల గాంధీ ఆదివారం బాధిత కుటుంబానికి అంద జేశారు. బురహాన్ పురంలోని జెండాల సెంటర్ కు చెందిన హరీష్ కొబ్బరి బోండాలు అమ్ముతు ంటారు. ఆయన దివంగత మున్నూరు కాపు సంఘం జిల్లా మాజీ అధ్యక్షులు, ప్రముఖ సీపీఐ నేత మేకల సంగయ్య కుమారుడు. కోవిడ్ సమయంలో స్టెరాయిడ్లు అధికంగా వాడటం వల్ల రెండు తొంట్లు దెబ్బతిన్నా యి. ఒకదాని తరువాత మరోటి.. రెండు ఆపరేష న్లు చేయించాల్సి వచ్చింది. ఇందులో ఒక ఆపరేషన్ వికటించడంతో స్వతహాగా నడవలేక పోతున్నాడు. కొబ్బరి బోండాల దుకాణం నడపలేక ఇబ్బందులు పడుతున్నాడు. ఈయన పరిస్థితిని కాపు సంఘం నేతలు ఎంపీ రవిచంద్ర దష్టికి తీసుకెళ్లారు. వెంటనే ఆయన చలించి రూ. 25 వేలు సాయం చేశారు. ఆ మొత్తాన్ని ఆకుల గాంధీ ద్వారా బాధితునికి పంపించారు. మేకల హరీష్ త్వరలోనే కోలుకోవాలని ఎంపీ రవిచంద్ర ఆకాంక్షించారు.