Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు టి.ప్రవీణ్
నవతెలంగాణ-ఖమ్మం కార్పొరేషన్
హాస్టల్స్ క్రమబద్ధీకరణ పేరుతో విలీనం చేయాలనే ఆలోచన విరమించుకోవాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు టి.ప్రవీణ్ డిమాండ్ చేశారు. ఖమ్మం నగరంలోని త్రీ టౌన్ ప్రాంతంలోని ప్రభుత్వ ఉమెన్స్ కళాశాలలో హాస్టల్ కమిటీ సమావేశంలో ప్రవీణ్ మాట్లాడు తూ.. రాష్ట్రంలో కేబినెట్ సబ్ కమిటీ 50 మంది కంటే తక్కువ విద్యార్థులు ఉన్న హాస్టల్స్ దగ్గరలోని హాస్టల్స్ లో విలీనం చేయడం లేదా పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్గా మార్చాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఈ ఆలోచన విరమించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. పేద విద్యార్ధులు ప్రధానంగా గ్రామీణ, ఆదివాసీ, దళిత విద్యార్థుల విద్యాభివృద్ధికి పట్టుగొమ్మలుగా హాస్టల్స్ ఉన్నాయి. విద్యార్థులను దగ్గరలో ఉన్న హైస్కూల్స్ నుండి హాస్టల్స్ లో చేర్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిది కానీ వారికి మెరుగైన సదుపాయాలు, మెస్ కాస్మోటిక్ ఛార్జీలను ప్రభుత్వం పెంచకుండా నిధులు ఇవ్వకుండా వాటిని నిర్వీర్యం చేసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోందన్నారు. వాటిని అభివృద్ధి పర్చకుండా విలీనం పేరుతో, క్రమబద్ధీకరణ పేరుతో మూసివేసే కుట్రలు చేయడం దుర్మార్గపు చర్య తక్షణమే నిధులు మంజూరు చేసి హాస్టల్స్ సదుపాయాలు వెంటనే కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకురాలు రాగిణి, శ్రావ్య నిఖిత, భవితశ్రీ, ప్రవళిక భాను, రమ్య, అంజలి, నవ్య శరీఫా, తదితరులు పాల్గొన్నారు.