Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సక్సెస్ చేసిన అందరికీ కృతజ్ఞతలు
- విజయ ఇంజనీరింగ్ కాలేజి వైస్ చైర్ పర్సన్ పారుపల్లి విజయలక్ష్మి కిరణ్ కుమార్
నవతెలంగాణ-కొణిజర్ల
విజయ ఇంజనీరింగ్ కాలేజీలో జేఎన్టీయూహెచ్తో పాటు సుమారు 30కి పైగా ప్రముఖ కంపెనీల ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన మెగా జాబ్ మేళా ఇంజనీరింగ్, ఫార్మసి, ఎంబీఏ, తదితర విభాగాల్లో ఉత్తీర్ణత సాధించిన నిరుద్యోగ యువత బంగారు భవిష్యత్తుకు బాటలు వేసిందని విజయ ఇంజనీరింగ్ కాలేజీ వైస్ చైర్ పర్సన్ విజయలక్ష్మి కిరణ్ కుమార్ అన్నారు. ఆదివారం విజయ ఇంజనీరింగ్ కాలేజీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రిన్సిపాల్ డా.జి. జాన్ బాబుతో కలిసి వైస్ చైర్ పర్సన్ విజయలక్ష్మి కిరణ్ కుమార్ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ఐటీ, ఫార్మా, మేనేజ్మెంట్, బ్యాంకింగ్, తదితర కంపెనీలు ఖమ్మం జాబ్ మేళాకు తరలి రావడం హర్షించదగిన విషయమన్నారు. జాబ్ మేళాకు వివిధ ప్రాంతాల నుండి 3200కు పైగా విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు. ఇంటర్వ్యూలు పూర్తయిన వెంటనే 170 మందికి జాబ్ ఆఫర్ లెటర్స్ అందజేశారని, మిగిలిన వారికి సోమవారం నుండి జాబ్ ఆఫర్ లెటర్స్ అందజేస్తామన్నారు. ఇంత పెద్ద కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వారికి, ముఖ్యంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పలువురు ప్రముఖులకు, మీడియా మిత్రులకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు.