Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మం
నగరంలోని 2 ,3 ,4 ,49 డివిజన్లో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం ఖమ్మం పార్లమెంట్ అబ్జర్వర్ కూరపాటి వెంకటేశ్వర్లు, ఖమ్మం నగర కోఆర్డినేటర్ వడ్డెం విజయ్ ఆధ్వర్యంలో ప్రారంభిం చారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ఇంటింటికి తెలుగుదే శం కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్క కార్యకర్తను కలిసి సభ్యత్వాలు చేర్పించి పార్టీకి పూర్వ వైభవం తేవడానికి అందరూ తమ వంతు కృషి చేయాలని కోరారు. అనంతరం మూడో డివిజన్ అధ్యక్షులు మద్దినేని రవి, గత నాలుగు నెలలుగా అనారోగ్యం తో బాధపడుతున్న అతని ఇంటికి వెళ్లి పరామర్శించారు. ప్రస్తుతం ఆ డివిజన్ బాధ్యతలను మీగడ రామారావుకి ఇవ్వడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కోఆర్డినేటర్లు గుండెపిన్ని నాగేశ్వరావు, మునగపాటి సంపత్, బాబు, కామ అనిత, కృష్ణమాచారి, రామాచారి, చాగంటి శ్రీకాంత్, కాంతాల లింగయ్య, పాల్గొన్నారు.