Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వైరాటౌన్
రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు నిర్ణయించి చట్టబద్ధత కల్పించాలని, వ్యవసాయ కార్మికుల ఉపాధి హామీ పథకానికి నిధులు కేటాయించి కొనసాగిం చాలని, కార్మికుల లేబర్ కోడ్స్ రద్దు చేయాలని, రైతుల రుణమాఫీ దేశం వ్యాప్తంగా అమలు చేయాలని కోరుతూ వైరా మండలం వల్లాపురం గ్రామంలో రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, సిఐటియు ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. రైతులు, కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఏప్రిల్ 5న నిర్వహించే చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు వైరా మండల కన్వీనర్ బాజోజు రమణ, రైతు సంఘం జిల్లా నాయకులు వనమా చిన్న సత్యనారాయణ, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి తూము సుధాకర్, శాఖా కార్యదర్శి షేక్ మజీద్, సీతారాములు, చిన్నప్పా, కొండయ్య, నవీన్, జయపాల్, నాగరాజు, దోర్నీస్, మద్ది చిన్నప్ప, పాల్గొన్నారు.