Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డాక్టర్ వాసిరెడ్డి రామనాధం
నవతెలంగాణ-బోనకల్
మండల పరిధిలోని ఆళ్లపాడు, రాయన్నపేట, కలకోట గ్రామాల్లో ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమాన్ని మధిర నియోజకవర్గం కోఆర్డినేటర్ వాసిరెడ్డి రామనాథం శనివారం రాత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ వాసిరెడ్డి రామనాథం మాట్లాడుతూ గ్రామస్థాయి నుండి పార్టీని బలోపేతం చేయడానికి ఈ కార్యక్రమాన్ని రూపొందించామన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా నాయకులు కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి బొట్టు పెట్టి కరపత్రాలు పంచుతూ సభ్యత్వాలను చేర్పించాలని అన్నారు. ఈ కార్యక్రమాన్ని అన్ని గ్రామాల్లో దిగ్విజయంగా పూర్తి చేయాలని, రెండు దశాబ్దాల పాటు తెలుగుదేశం అందించిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బోనకల్ మండల కన్వీనర్ రావుట్ల సత్యనారాయణ, రాష్ట్ర నాయకులు చేకూరి శేఖర్ బాబు, జిల్లా నాయకులు నందమూరి సత్యనారాయణ, మైనేని రవికుమార్, దేవబత్తిని వెంకటి, ఆళ్లపాడు గ్రామ నాయకులు మరీదు బరకయ్య, తాళ్లూరు పిచ్చయ్య, పారా కోటయ్య, తూము పురుషోత్తం, మందా నరేందర్, పారా వెంకటేశ్వర్లు, తోటకూర వెంకటేశ్వర్లు, మందా సురేందర్, తోటపల్లి నరేష్, తదితరులు పాల్గొన్నారు.