Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఖమ్మం
ఖమ్మం భక్త రామదాసు కళాక్షేత్రం లో ఆదివారం రాత్రి జరిగిన
సప్త కళలల సమ్మేళనం ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో కైరెల్లి డాన్సర్ అకాడమీ వారిచే భరతనాట్యం, గ్రూప్ డాన్స్, తెలంగాణ ఉద్యమ గాయకుడు గిద్ద రామ నరసయ్య జానపదం గేయాలు ఉరూతలు ఉగించింది, సినీ నాయకులు జాన్ జానపద హంగామా, ఫైర్ ప్రార్ధవిక, ఫైర్ పండులచే రింగ్ డాన్స్ అబ్బురపరిచింది. మ్యాజిక్, ప్రముఖ మిమిక్రీ కళాకారుడు సురేష్ చే మిమిక్రీ కడు పుబ్బ నవ్వించింది. డిటిఎస్ ఆనంద వైజాగ్ చే బీట్ బాక్స్, ఇండియన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హౌల్డర్ ఫైర్ రవిచే ఫైర్ డాన్స్, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ హౌల్డర్ కిషన్ బొంబాయిచే జగ్లింగ్ కత్తుల ప్రదర్శన ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. ప్రముఖ వ్యాఖ్యాత జి.రవీంద్రకి, సినీ ఉద్యమ గేయ రచయిత యశ్ పాల్క్ ప్రముఖ మెజీషియన్ రామడుగు వసంత ప్రముఖ రచయిత దర్శకులు కొత్తపల్లి శేషు కి, కమెడియన్ మొగిలి గుణకర్ను సన్మానించారు. కళా కార్యదర్శి వేల్పుల విజేత ఆధ్వర్యంలో సభ కార్యక్రమాలలో, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ దోరేపల్లి శ్వేత, ఖమ్మం కళాపరిషత్ అధ్యక్షులు డాక్టర్ నాగ బత్తిని రవి, పైవేట్ స్కూల్ అసోషియన్ అధ్యక్షులు రామచందర్రావు, శేషగిరి అన్నాబత్తుల సుబ్రహ్మణ్య కుమార్, మోటమర్రి జగన్మోహన్ రావు, తదితరులు పాల్గొన్నారు.