Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏప్రిల్ 5న చలో ఢిల్లీ
- మార్చి 5 నుండి 30 వరకు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో విస్తృత ప్రచారం
నవతెలంగాణ-భద్రాచలం
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, కర్షక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఏప్రిల్ 5 తేదీన చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని, ఇందుకు సంబందించి మార్చి 5 నుండి 30 వరకు అన్ని గ్రామాల్లో, కాలనీలో విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు మచ్చా వెంకటేశ్వర్లు, సీఐటీయూ జిల్లా అధ్యక్షులు కే.బ్రహ్మచారి, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు యలమంచి వంశీకృష్ణలు పిలుపునిచ్చారు. వ్యకాస పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి అధ్యక్షతన జరిగిన ప్రజాసంఘాల పట్టణ స్థాయి సదస్సులో వారు ప్రసంగించారు. ఈ బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత కార్మికుల హక్కులను కాలరాస్తూ కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్గా తీసుకువచ్చి నిర్వీర్యం చేస్తోందని విమర్శించారు.
వ్యవసాయాన్ని కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పి వ్యవసాయ రంగాన్ని, రైతాంగాన్ని దివాలా తీయించేందుకు మోడీ ప్రభు త్వం పూనుకుందని దేశవ్యాప్తంగా రైతులు సుదుర్గ పోరాటం నిర్వహించి రైతాంగ వ్యతిరేక చట్టాలను నిలువురించారని అన్నారు. పెట్రోలు, డీజీలు, వంట గ్యాస్, నిత్యవసర వస్తువులు ధరలు పెంచి సామాన్య ప్రజలపై మోడీ ప్రభుత్వం భారాలు పెంచి ప్రజల నడ్డి విరుస్తోందని దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ సీనియర్ నాయకులు ఎంబీ నర్సారెడ్డి, ఐద్వా పట్టణ అధ్యక్ష కార్యదర్శులు యు.జ్యోతి, డి.సీతాలక్ష్మి, సీనియర్ నాయకులు నాదెళ్ల లీలావతి, జి.జ్యోతి, సీఐటీయూ నాయకులు ఎన్.నాగరాజు, లక్ష్మణ్, గిరిజన సంఘం నాయకులు సున్నం గంగ, డివైఎఫ్ఐ నాయకులు ప్రేమ్ కుమార్, సతీష్ కుమా ర్, కేవీపీఎస్ నాయకులు కోరాడ శ్రీనివాస్, కృష్ణార్జున రావు, ప్రజానాట్య మండలి జిల్లా అధ్యక్షులు గౌతమి, డి.రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.