Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఏజే. రమేష్
నవతెలంగాణ-కొత్తగూడెం
ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల న్యాయమైన సమస్యలు వెంటనే పరిష్కరించాలని, వారికి కనీస వేతనాలు రూ.26 వేలు ఇవ్వాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఏజే రమేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం సీఐటీయూ కార్యాలయంలో జరిగిన జిల్లా ప్రభుత్వ హాస్పిటల్ జిజిహెచ్, ఎంసిఎచ్ మెడికల్ కాలేజ్‌లలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల మహాసభలో ఆయన పాల్గొని మాట్లాడుతూ కరోనా కాలంలో కూడా విపత్తుల పరిస్థితుల్లో ప్రాణాల సైతం లెక్కచేయ కుండా రోగులను కాపాడిన వారిలో మొదటి వరుస లో వారియర్స్‌గా హాస్పిటల్ కార్మికులు నిలుస్తారని తెలిపారు. అలాంటి కార్మికులను ప్రభుత్వం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా చూస్తుందని, వారి జీతాలు అరకొరా చెల్లిస్తున్నారని ఆయన విమర్శిం చారు. కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్లను తీసుకొచ్చి కార్మికులు అనాదిగా సాధించుకున్నటువంటి హక్కులైన 8గంటల పని దినాలు, సంఘం పెట్టు కునే హక్కు, సమ్మె చేసే హక్కు ఈ రోజు అవి లేకు ండా చేయడం కోసం కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం చూ స్తుందని అలాంటి విధానాలను తిప్పికొట్టేందుకు యావత్ కార్మిక లోకం సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపు నిచ్చారు. ఇలాంటి లేబర్ కోడ్లను రద్దు చేయాలని ఏప్రిల్ 5వ తారీఖున ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని కార్మికుల లోకం విజయ వంతం చేయాలని ఆయన పిలుపు నిచ్చారు. ఈ మహా సభలో. సిఐటియు పట్టణ కార్యదర్శి డి.వీరన్న, సిఐటియు జిల్లా నాయకులు భూక్య రమేష్, లిక్కి బాలరాజు, అనిల్, ఆది, గంగా, భాగ్య లక్ష్మి, నవీన్, శివారెడ్డి, నాగరాజు, అవినాష్, రంజిత్, రమేష్, పవన్, రాము, పాల్గొన్నారు.