Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రజా వ్యతిరేక పాలనను గద్దెదించాలి
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి కనకయ్య
నవతెలంగాణ-ఇల్లందు
సామాన్య ప్రజలపై అదనపు భారం మోపుతూ గ్యాస్ ధరలు పెంచడమే నా దేశభక్తి అని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య విమర్శించారు. రానున్న ఎన్నికల్లో కేంద్రంలోని బీజేపీ ప్రజా వ్యతిరేక పాలనను గద్దెదించాలని పిలుపునిచ్చారు. పెంచిన వంటగ్యాస్ సిలిండర్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు. స్థానిక ఏలూరి భవన్లో ఆదివారం జరిగిన పార్టీ మండల కమిటీ సమావేశ లో ఆయన పాల్గొని మాట్లాడారు. 2014లో వంట గ్యాస్ బండ ధర రూ.410, ఉండగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వంలో మోడీ ప్రధాన మంత్రి అయిన తర్వాత ఈ తొమ్మిది ఏళ్లలో రూ.745 పెంచి ఇపుడు రూ.1155 చేర్చారని, డీజిల్, పెట్రోల్ ధరలు పెరగగా దానికి తోడు వంట గ్యాస్ సిలిండర్ ధరలు, నిత్యావసర సరుకుల ధరలు పెరగడం వలన సామాన్య మధ్యతరగతి ప్రజలపై తీవ్రమైన ఆర్థిక భారం పడ్డదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి సబ్ కా సాత్ సబ్కావికాస్, ఆత్మ నిర్భర భారత్, అచ్చేద్దిన్ ముద్దు ముద్దు చిలక పలుకుల మాటలతో ప్రజలను తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారన్నారు. రామ రాజ్యం అంటే 80 కోట్ల మంది హిందువుల పైన భారం వేయడమేనా, పేదవాడి పైన గ్యాస్ రేట్లు పెంచడమేనా దేశ భక్తి, అంబానీ, ఆధానికి దేశ సంపద దోచి పెట్టడమే బీజేపీ విధానమా అని ప్రశ్నించారు. పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు ఏ.జే రమేష్ మాట్లా డుతూ ప్రజల పై భారాలు మోపుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికులకు కనీస వేతనం రూ.26 వేల ఇవ్వాలని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ పెడచెవిన పెట్టాయి అన్నారు. ఈ సమావేశంలో అబ్ధుల్ నబి, తాళ్లూరి కృష్ణ, ఆలేటి కిరణ్, మన్యం మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.
దుమ్ముగూడెం పెంచిన గ్యాస్ సిలెండర్ ధర తగ్గించాలని సీనియర్ కాంగ్రెస్ నాయకుడు పిలక వెంకట రమణ రెడ్డి అధ్వర్యంలో మండ లంలోని లక్ష్మినగరంలో నిరసన చేపట్టారు. ఈ సంద ర్భంగా వెంకటరమణా రెడ్డి మాట్లాడారు. మరొక పక్క నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటు కున్నాయని, రాబోయే రోజల్లో బీజేపీ ప్రభుత్వానికి ప్రజలు గట్టిగా బుద్ది చెప్పడం ఖాయం అన్నారు.