Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాకు అన్యాయం జరిగిందంటూ వందల సంఖ్యలో ప్రజావాణిలో దరఖాస్తులు
- పరిశీలించి అనర్హులను తొలగిస్తాం : కలెక్టర్
నవతెలంగాణ పాల్వంచ
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న డబల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ తీవ్ర విమర్శలకు దారి తీస్తున్నాయి. అర్హులైన లబ్ధిదారులు ఆందోళనలు ధర్నాలు రెండు, మూడు రోజులుగా కొత్తగూడెం నియోజకవర్గం, చివరకు వీటి సెగ కలెక్టర్ కార్యాలయానికి తగిలింది, కొత్తగూడెం, పాల్వంచలో పూర్తికాని డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు డ్రా విధానంతో లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు జరిగాయని ఇండ్లున్న వారికే ఇండ్లు వచ్చాయని, డబ్బులు ఇచ్చిన వాళ్ళకి ఇండ్లు కేటాయించారని సోమవారం కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణికి అర్హులైన నిరుపేదలు వందల సంఖ్యలో చేరుకొని కలెక్టర్‌ను నిలదీశారు. దీంతో కలెక్టర్ స్పందిస్తూ లబ్ధిదారుల ఎంపిక దరఖాస్తులను మరోసారి పరిశీలిస్తానని, ఇంకా పూర్తి కాలేదని, పూర్తి కావాల్సినవి చాలా ఉన్నాయన్నారు. వార్డుల వారీగా దరఖాస్తులన్నీ మరొకసారి పరిశీలిస్తానని హామీ ఇచ్చారు. అర్హులైన లబ్ధిదారులకు అందరికీ అందేలా చర్యలు తీసుకుంటానని చెప్పారు. దీంతో ఇప్పటివరకు డ్రా విధానంతో ఎంపిక చేసిన వాటిని రద్దు చేయాలని ప్రజలు డిమాండ్ చేయడంతో దరఖాస్తులను పరిశీలిస్తానని తదుపరి చర్య తీసుకుంటానని చెప్పారు. డ్రా విధానం సరైంది కాదని రాజకీయ పార్టీలు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఇప్పటివరకు జరిగిన ఎంపికలు పేర్లని బహిర్గతం చేయాలని తహసిల్దార్ కార్యాలయం ఎదుట ఉంచాలని డిమాండ్ చేశారు. తక్షణమే విచారణ జరపాలని కోరారు. కొత్తగూడెం నియోజకవర్గంలో మొత్తం 1800 మంజూరు అయితే ఇప్పటివరకు కేవలం 126 ఇల్లు మాత్రమే నిర్మాణం పూర్తయ్యాయి, వాటిలో 85 ఇండ్లను లబ్ధిదారులకు స్వాధీనం చేశారు. 41 ఇండ్లను కేటా యిం చారు. మిగిలిన 1674 ఇండ్లు అసంతృప్తిగా ఉన్నాయి. కొత్తగూడెంలో 840, పాల్వంచలో మున్సిపా లిటీలో 400 ఇల్లు మంజూరు చేయగా వీటిలో ఒక్క ఇల్లు కూడా పూర్తి కాకపోవడం విడ్డూరం.
కలెక్టరేట్‌కు డబుల్ ఇండ్ల లబ్ధిదారులు అధిక సంఖ్యలు రావడంతో కలెక్టర్ డీఆర్ఓ చక్రవర్తిని దరఖాస్తులు తీసుకోవాలని, వారికి సమాధానం చెప్పాలని ఆదేశించడంతో డీఆర్ఓ కలెక్టర్ కార్యాలయం ఎదుట లబ్ధిదారులతో మాట్లాడుతూ ఎంపికలో ఎలాంటి అవకతవకలు జరిగిన వాటిపై తక్షణమే జిల్లా అధికారులతో దరఖాస్తు పరిశీలన చేపిస్తామని కలెక్టర్ తెలిపారని, ఎవరూ కంగారు పడవలసిన అవసరం లేదని, ఇంకా నిర్మాణం కావాల్సిన డబల్ బెడ్లు చాలా ఉన్నాయని, అర్హులైన లబ్దిదా రులకు అందరికీ అందే విధంగా కలెక్టర్ చర్యలు తీసుకుం టారని తెలిపారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పాల్వంచ, కొత్తగూడంలో డబుల్ ఇండ్ల లబ్దిదారుల ఎంపికలో జరిగిన అవినీతిని విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.