Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హాజరుకానున్న తమ్మినేని, పోతినేని
- సీపీఐ(ఎం) పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి
నవతెలంగాణ-భద్రాచలం రూరల్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీపీఐ(ఎం) జిల్లా ప్లీనం నేడు భద్రాచలం పట్టణంలోని రెడ్డి ఫంక్షన్ హాల్ నందు జరగనుంది. సుమారు 750 మంది పార్టీ, వివిధ స్థాయి కార్యకర్తలు పాల్గొనే ఈ జిల్లా ప్లీనంనకు ముఖ్య అతిథులుగా సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు, పార్టీ జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య, రాష్ట్ర కమిటీ సభ్యులు బండారు రవికుమార్, మచ్చ వెంకటేశ్వరరావు, ఏజే రమేష్‌లు పాల్గొనున్నారు. ఈ సందర్భంగా పార్టీ పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి నవతెలంగాణతో ప్రత్యేకంగా మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలను ఈ జిల్లా ప్లీనంలో రూపొందిస్తామని తెలియజేశారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీని రాష్ట్రంలో అడుగుపెట్టనీయకుండా చేసే విధంగా మా ఎత్తుగడలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. మతోన్మాద బీజేపీని నివారించేందుకే రాష్ట్రంలో ఎన్నికల పొత్తులు ఉంటాయని ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. ఎంతో ప్రాధాన్యత గల ఈ జిల్లా ప్లీనానికి ఎంపికైన ప్రతినిధులు సకాలంలో హాజరై జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.