Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భద్రాచలం
వాతావరణం మార్పు వలన గిరిజన గ్రామాలలో వైరల్ ఫీవర్ ప్రభలుతున్నందున ముఖ్యంగా ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న విద్యార్థినీ, విద్యార్థుల ఆరోగ్య స్థితిగతులను ఎప్పటికప్పుడు గమనించి వారి చదువుకు భంగం కలగకుండా చూడవలసిన బాధ్యత సంబంధిత ప్రధానోపాధ్యాయులపై ఉందని భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి గౌతమ్ పోట్రు అన్నారు. సోమవారం ఐటీడీఏ సమావేశం మందిరంలో నిర్వహించిన గిరిజన దర్బార్‌కు వచ్చిన ఆదివాసి గిరిజనుల నుండి ఆయన అర్జీలు స్వీకరించారు. తన పరిధిలో ఉన్నవి వెంటనే పరిష్కరించి, మిగతా వాటిని సంబంధిత అధికారులకు పంపుతూ అర్హులైన ప్రతి గిరిజన కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు అందే విధంగా కృషి చేయాలని ఆయన అన్నారు. గిరిజనులు సమర్పించిన అర్జీలను ప్రత్యేకమైన రిజిస్టర్లో నమోదు చేసి, అర్హులైన ప్రతి గిరిజన కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా ప్రవేశ పెట్టే రుణాలు అందే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీవో(జనరల్) డేవిడ్ రాజ్, డీడీ ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని రమాదేవి, ఈఈ ట్రైబల్ వెల్ఫేర్ తానాజీ, ఎస్ఓ సురేష్ బాబు, డీటీఆర్ఓఎఫ్ ఆర్ శ్రీనివాస్, మేనేజర్ ఆదినారాయణ, హెచ్‌ఈవో దుర్గయ్య, ఏపీవో (పవర్) మునీర్ పాషా, డిఎస్ఓ ప్రభాకర్ రావు, జేడీఎం హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.