Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పదవ తరగతి విద్యార్థులకు స్నాక్స్‌కు నగదు అందజేత
నవతెలంగాణ-పినపాక
మండల పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దుగినేపల్లిలో 8 నుండి 10వ తరగతి వరకు విద్యార్థులకు పాఠ్యాంశాలు బోధించుటకు ఉపాధ్యాయులు కొరత ఉండటం గమనించిన జడ్పీటీసీ దాట్ల సుభద్రాదేవి స్వతహాగా విద్యా వాలంటీర్లను నియమించారు. విద్యా వాలంటరీకి నెలకు రూ.3000 చొప్పున మిగిలి ఉన్న రెండు నెలలకు నెలలకు కలిపి రూ.6000 జడ్పీటీసీ సుభద్రాదేవి వాసు బాబు అందజేశారు. దానితో పాటు పదో తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు ఉదయం సాయంత్రం స్నాక్స్‌లను అందించటం కోసం నెలకు రూ.3000 చొప్పున నగదును హెడ్మాస్టర్కు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మలిపెద్ది సత్యవతి వెంకన్న, ఎంపీటీసీ ఉమాదేవి సత్యనారాయణ, గ్రామ అధ్యక్షులు రజపతిరావు, బూర్గంపాడు మార్కెట్ కమిటీ డైరెక్టర్ బెల్లం సాంబశివరావు, సీనియర్ నాయకులు ఉగ్య సమ్మయ్య, బత్తుల చిన లక్ష్మీనారాయణ, ప్రధానోపాధ్యాయుడు రవి, అనురాధ, పీఈటీ వీరన్న, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.