Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కన్నీటి పర్వంతమైన కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు
నవతెలంగాణ-దుమ్ముగూడెం
వ్యవశాయ పనుల కోసం తండ్రికి తోడుగా వెళ్లిన ఆ విద్యార్ధి కానరానిలోకాలకు వెళ్లిపోయాడు. ఉన్నత చదువులు చదువుకుని కుటుంబ సభ్యులకు అండగా ఉంటాడు అనుకున్న తరుణంలో మృత్యువు వెంటాడింది. ఇంటికి వచ్చిన తన కుమారుడిని చివరిసారిగా కళ్లారా చూడలేదని, మనస్సు విప్పి పలకరించకుండానే కానరాని లోకాలకు వెళ్లావా అంటూ కళ్యాణ్ తల్లి తనకుమారుడిని చూస్తూ దుక్కిస్తున్న తీరు చూపరులను కన్నీరుపెట్టించింది.
వివరాల ప్రకారం...మండలంలోని రామారావుపేట గ్రామానికి చెందిన వర్షా కళ్యాణ్ అనే గిరిజన విద్యార్ధి (25) హైదరాబాద్‌లోని జేఎన్టీయూ యూనివర్శీటీలో ఎంటెక్ ఫైనల్ సంవత్సరం విద్యను అభ్యశిస్తున్నాడు. కళ్యాణ్ తండ్రి వర్షా చిన్నారావు రామారావుపేట గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్‌తో పాటు ప్రస్తుతం సీపీఐ(ఎం) శాఖా కార్యదర్శిగా పని చేస్తున్నారు. వర్షా చిన్నారావు, జయలకీë దంపతులకు ఇద్దరు పిల్లలు కాగా కుమార్తె కావ్య బిటెక్ సివిల్ విద్యను పూర్తి చేసింది. ఆదివారం కళ్యాణ్ హైదరాబాద్ నుండి ఇంటికి వచ్చాడు. తండ్రి చిన్నారావు మిర్చి తోటకు మందు పిచికారి చేస్తుండగా తోడుగా ట్యాంక్‌లో నీళ్లు పోస్తూ వ్యవశాయ పనుల్లో పాల్గొన్నాడు. మందు కొట్టడం ముగిశాఖ ఇంటికి వెళుతున్నాను అని చెప్పి పంట పొలం వద్దే కుప్ప కూలాడు. గమనించిన తండ్రి చిన్నారావు కొడుకును పిలుస్తూనే పక్కవారి సహా యంతో భద్రాచలం తీసుకు వెళ్లారు. అప్పటికే కళ్యాణ్ మృతి చెందాడు. ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేని కళ్యాణ్ గుండెపోటు రావడం వల్లనే మృతి చెందాడని కుటుంబ సభ్యులు తెలుపుతున్నారు.
కళ్యాణ్ మృతి బాధాకరం : మచ్చా
రామారావుపేట గ్రామపంచాయితీ మాజీ సర్పంచ్, సీపీఐ(ఎం) శాఖా కార్యదర్శి వర్షా చిన్నారావు తన 25 ఏళ్ల కుమారుడు గుండె పోటుతో మృతి చెందడం అత్యంత భాధాకరం అని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చా వెంకటేశ్వర్లు, మాజీ డీసీసీబీ చైర్మన్ యమలంచి రవికుమార్ అన్నారు. ఆదివారం కళ్యాణ్ పార్దివ మృత దేహాన్ని వారు సందర్శించి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి సంతాపాన్ని తెలియజేశారు. కళ్యాణ్ పార్దివ మృత దేహానికి నివాళులు అర్పించిన వారిలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి కారం పుల్లయ్య, రామారావు పేట సర్పంచ్ సోయం పార్వతి, సీతారాంపురం ఎంపీటీసీ యలమంచి వంశీకృష్ణ, భద్రాచలం పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి, నాయకులు సరియం కోటేశ్వరరావు, బొల్లి సూర్యచందర్‌రావు, కొడాలి లోకేష్‌బాబు, మర్మం చంద్రయ్య, మోహన్ రావు, సరియం రాజమ్మ తదితరులు ఉన్నారు.