Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భద్రాచలం రూరల్
భద్రాచలం ఐద్వా పట్టణ కమిటీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సదస్సు సోమవారం జరిగింది. ఐద్వా పట్టణ అధ్యక్షురాలు యు.జ్యోతి అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో ఐద్వా జిల్లా కార్యదర్శి మందలపు జ్యోతి మాట్లాడుతూ మహిళలు సామాజిక హక్కుల కోసం వివిధ రంగాల్లో భాగస్వామ్యం పెంచుకోవడం కోసం అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటామన్నారు. ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా మార్చి 8న ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేగా జరుపుకుంటామని తెలిపారు. ఈ సదస్సులో భాగంగా ప్రముఖమహిళ లాయర్ సంక నర్మద, సాహితీ స్రవంతి టౌన్ అధ్యక్షురాలు సొంపక సీత మాట్లాడుతూ రోజురోజుకీ మహిళలపై యువతపై అత్యాచారాలు ఎక్కువైపోతున్నాయని అన్నారు. మహిళలు, యువతలు ఆత్మహత్యలు చేసుకోవడం కరెక్ట్ కాదు ధైర్యంగా ఎదుర్కొని సమస్యలను పరిష్కరించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఐద్వా కార్యదర్శి డి.సీతాలక్ష్మి, జిల్లా నాయకులు ఎన్.లీలావతి, బి.కుసుమ, జి.జ్యోతి, ఎస్.గంగ, సిహెచ్ రమణ, మచ్చా రామా, పీఎన్ఎమ్ రాష్ట్ర కమిటీ సభ్యురాలు యేజే గౌతమి తదితరులు పాల్గొన్నారు.