Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అన్నపురెడ్డిపల్లి
మండల కేంద్రానికి పల్లె వెలుగు బస్సు కావాలని అన్నపురెడ్డిపల్లి మండల హెడ్ క్వార్టర్ ఎంపీటీసీ అయిలూరి కృష్ణారెడ్డి, యువజన నాయుకులు హరీష్ ఆధ్వర్యంలో పలువురు మండల ప్రజలతో కలిసి ఆర్టీసీ రియజనల్ మేనేజర్ భవాని ప్రసాద్ని కలిసి వినతి పత్రం అందజేశారు. అదేవిధంగా మండలంలోని పలు గ్రామ పంచాయతీల్లో అనారోగ్య సమస్యలతో ప్రయివేట్ హాస్పటల్లో వైద్యం చేయించుకొని సీఎం రిలీఫ్ ఫండ్ కోసం సంబధిత పత్రాలను ఎంపీ నామా నాగేశ్వరరావు క్యాంప్ కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్బంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజరు కుమార్, ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరావు దృష్టికి తీసుకు వెళ్ళామని అన్నారు. వారి సహకారంతో పరిష్కరించే విధంగా కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో చిన లక్ష్మణరావు, శివ నాయక్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.